‘పులి’ కి ఖయమైన కలెక్షన్ లెక్కలు..!
ఈ రోజు రిలీజ్ కాబోతోన్న 'కొమరం పులి" కలెక్షన్స్ పై ట్రేడ్ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దాదాపు 600 ప్రింట్స్ తో 1000కి పైగా థియేటర్ల లో విడుదలవుతోన్న 'కొమరం పులి" ఫస్ట్ డే షేర్ లో ప్రీవియస్ రికార్డ్స్ అన్నిటినీ క్రాస్ చేసెయ్యడం ఖాయం అంటున్నారు. అలాగే ఫస్ట్ వీక్ షేర్ లో కూడా బాక్సాఫీర్ రికార్డులు బద్దలవడం తథ్యమంటూ తడబడకుండా లెక్కలు చెప్పేస్తున్నారు. ఆ అంకెలు ఎలా వున్నాయంటే..ట్రేడ్ వర్గాల అంచనాల మేరకు గ్రాండ్ గా రిలీజ్ అవుతోన్న 'కొమరం పులి" కి మినిమమ్ 30 కోట్ల షేర్ గ్యారంటీ. ఎబౌ ఏవరేజ్ టాక్ వచ్చిందంటే 'పులి"కి మినిమమ్ 30కోట్ల షేర్ గ్యారంటీ.
ఎబౌ ఏవరేజ్ టాక్ వచ్చిందంటే 'పులి"కి దక్కే షేర్ 40కోట్లకు పైమాటే. ఇక సూపర్ హిట్ అనే రిపోర్ట్ వినిపించిందంటే 'కొమరం పులి" కొత్త చరిత్రను లిఖిస్తుందనీ, 'మగధీర"ను అవలీలగా అదిగమించి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనీ చెబుతున్నారు. అంతే కాదండోయ్..తన ప్లాప్ సినిమాకైనా మినమమ్30కోట్ల షేర్ రప్పించగల పవర్ స్టార్ కి ఈ టైమ్ లో'ఖుషీ"లాంటి స్ట్రాంగ్ హిట్ పడితే టాలీవుడ్ హిస్టరీలో 100కోట్ల విజయాన్ని చూడొచ్చనే ధీమా సర్వత్రా వ్యక్తమవుతోంది. మరి ఆ కోరికను 'కొమరం పులి" తీర్చగలదేమో, పవర్ ఫుల్ హిట్ తో పవన్ పొటెన్సియాలిటీని ప్రూవ్ చేయగలదేమో చూద్దాం.!


Click it and Unblock the Notifications











