పవన్ కళ్యాణ్ తో సినిమా రూమరేనా?
వన్ కళ్యాణ్,రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు చాలా కాలం నుంచీ ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. దానికి తోడు రీసెంట్ గా పవన్ ..కెమెరామెన్ గంగతో రాంబాబు సెట్స్ కు రాజమౌళి వెళ్లి ఓ స్టోరీలైన్ ని నేరేట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆ స్టోరీలైన్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాజమౌళి కథను పూర్తిగా ట్రీట్ మెంట్ తో సహా చేసుకువస్తానని చెప్పినట్లుగా రూమర్స్ స్పెడ్ అవుతున్నాయి. అయితే ఇవేమి నిజం కాదని తెలుస్తోంది. ఇవి కేవలం ఈగ హిట్ ని బేస్ చేసుకుని పుట్టిన రూమర్స్ గా చెప్పుకుంటున్నారు.
ఎందుకంటే రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యి రిలీజ్ అయ్యేసరికి దాదాపు ఓ సంవత్సరం వరకూ పడుతుంది. అదీ భారీ బడ్జెట్ తో కూడిన చిత్రం అని చెప్తున్నారు. ఈ నేఫధ్యంలో తర్వాత మహేష్ తో చేస్తాడా,పవన్ తో చేస్తాడా అనేది ఇప్పుడిప్పుడే తేలే విషయం కాదు. అంతేగాక పవన్ సైతం తన తదపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'లో చేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలై ఒక పాట కొన్ని సీన్స్ పూర్తయ్యాయి. ఇందులో విలన్‌గా నా డార్లింగ్ ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు.
తొలి కలయిక 'బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. 'బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. 'గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.
ఇందులో పవర్‌స్టార్ మెకానిక్ గా నటిస్తున్నారు. నేటి రాజకీయాలపై ఓ వ్యంగాస్త్రంగా ఈ చిత్రాన్ని పూరీ రూపొందిస్తున్నట్లు సమాచారం. తమన్నా ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. పవన్‌కళ్యాణ్,తమన్నా కలిసి నటిస్తున్న తొలి సినిమా కూడా ఇదే. అక్టోబర్ 18న గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











