పవన్ - రామ్ చరణ్ లతో పోటీకి దిగిన వాళ్ళిద్దరూ...
పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ల వల్ల ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అయిందిప్పుడు. అలాగని ఇది హీరోల పోటీ కాదండోయ్..వాళ్లిద్దరి సినిమాల ద్వారా ఇద్దరు టాప్ టెక్నీషియెన్స్ మధ్య క్రియేట్ అయిన క్రియేటివ్ వార్ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ గా తిరుగులేని గుర్తింపు కలిగిన ఎఆర్ రహమాన్ కి నేనేం తక్కువ కాదంటూ ఎప్పుడూ పోటీ పడుతుంటాడు హారిష్ జైరాజ్.
సౌత్ లో ఈ ఇద్దరి మధ్యా షఫిల్ అయ్యే సినిమాలూ, డైరెక్టర్ల గురించి కూడా అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు పవర్ స్టార్ 'కొమరం పులి"కి రహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా మరో మెగా హీరో రామ్ చరణ్ 'ఆరంజ్" కి హారిస్ జైరాజ్ మ్యూజిక్ చేస్తున్నారు. ఆల్ రెడీ రిలీజైన 'కొమరం పులి" ఆడియోకి మంచి స్పందన లభించడాన్ని గమనిస్తూనే 2010 మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా 'ఆరంజ్" ని నిలబెట్టాలనే కసితో వున్నారట హారిస్. మొత్తానికీ తతంగం వల్ల మెగా ఫ్యాన్స్ కి మాత్రం మ్యూజికల్ ట్రీట్ ఖాయం అయినట్టే..!


Click it and Unblock the Notifications











