‘అజ్ఞాతవాసి’ మూవీ కథ ఇదేనా? ఆ హాలీవుడ్ మూవీకి స్పూర్తి?
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అజ్ఞాతవాసి' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అసలే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. పోస్టర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
స్టార్ హీరోలు, డైరెక్టర్ల సినిమాలపై తరచూ ఏదో ఒక రూమర్ ప్రచారంలో ఉంటుంది. తాజాగా 'అజ్ఞాతవాసి' కథపై గురించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది.

అజ్ఞాతవాసి కథ హాలీవుడ్ మూవీకి స్పూర్తి?
ఓ హాలీవుడ్ మూవీ చూసి ఇన్‌స్పైర్ అయి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. ‘ది హెయిర్ అప్పారెంట్' అనే ఓ ఇంగ్లిష్ చిత్రాన్ని చూసిన తర్వాత త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి' కథ రాసుకున్నాడని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

‘ది హెయిర్ అప్పారెంట్’ కథేంటి?
‘ది హెయిర్ అప్పారెంట్' కథ పరిశీలస్తే.... ఓ ధనవంతుడు అనుకోకుండా ఓ ప్రమాదంలో చనిపోతాడు. అతనికి ఇద్దరు భార్యలు. అతని ఆస్తంతా కాజేయాలని ఓ ముఠా కుట్ర పన్నుతుంది. అయితే ధనవంతుడి మొదటి భార్యకి ఓ కొడుకు ఉంటాడు. తను ఎక్కడున్నాడో అంతుపట్టదు. అతని కోసం సాగించిన అన్వేషణ, అతనొచ్చాక ఎదురైన పరిణామాలతో కథ సాగుతుంది.

‘అజ్ఞాతవాసి’ చిత్రానికి, దీనికి సంబంధం ఉందా?
‘అజ్ఞాతవాసి' కథ కూడా ‘ది హెయిర్ అప్పారెంట్' కథకు దగ్గరగా ఉంటుందని, కాకపోతే దీనికి తెలుగు నోటివిటీ, వివిధ సందర్బాలు, కొత్త పాత్రలు జోడించి త్రివిక్రమ్ ‘అజ్ఞాతవాసి' సినిమా కథ రాసుకున్నాడని అంటున్నారు.

హిట్ కాంబినేషన్, హాట్రిక్ ఖాయమేనా?
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్టే. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా', ‘అత్తారింటికి దారేది' చిత్రాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘అజ్ఞాతవాసి' సినిమాతో వీరు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.

పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మాన్యూయేల్ నటిస్తున్నారు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు.

సంక్రాంతి రిలీజ్
హారిక్ అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 2018జ నవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











