'కెమెరామెన్ గంగతో...' పై తెలంగాణా మార్చ్ ఎఫెక్ట్?
హైదరాబాద్ : పవన్‌కల్యాణ్ హీరోగా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల తేదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రోజు కాకుండా ఓ వారం ముందుకు అంటే అక్టోబర్ 18కి వెళ్లేటట్లు ఉందని ఇండస్ట్రీ టాక్. దానికి కారణం..వినాయిక నిమజ్జనం,తెలంగాణా జె.ఎ.సి తలపెట్టిన తెలంగాణా మార్చ్ అని తెలుస్తోంది. గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 29న జరుగుతుంది. అలాగే తెలంగాణా మార్చ్ సెప్టెంబర్ 30న జరగనుంది.
దాంతో సెప్టెంబర్ 28న విడుదల తేదీ పెట్టుకున్న రెబెల్ కు రెండు రోజులు పాటు కలెక్షన్స్ పరంగా దెబ్బ తగులుతుంది. ఈ నేపధ్యంలో ఓ వారం ముందుకు అంటే అక్టోబర్ మొదటి వారంకు ఈ చిత్రం విడుదల తేదీని మార్చే అవకాసం ఉందని సమాచారం. రెబెల్ రిలీజ్ డేట్ ఛేంజ్ అయితే వెంటనే దాని వెనకే వస్తున్న 'కెమెరామెన్ గంగతో...' విడుదల తేదీ ని కూడా ముందుకు జరుపుతారు. ఇలా ఈ రెండు చిత్రాలు విడుదల తేదీలు మారనున్నాయని సమాచారం. రెండు పెద్ద సినిమాలు వారం అయినా గ్యాప్ లేకపోతే ధియోటర్స్ దొరకవు. అయితే నిర్మాతలు అఫీషియల్ ఏదీ ప్రకటించలేదు.
'కెమెరామెన్ గంగతో...' చిత్రానికి ట్రేడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. పూరీ జగన్నాధ్,పవన్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత వస్తున్న చిత్రం కావటంతో అంతటా షాకిచ్చే రేంజిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఇప్పటివరకూ ఏ హీరోకు లేనంతగా అమెరికా మినహా ఓవర్ సీస్ బిజెనెస్ కోటి రూపాయలు జరిగిందని సమాచారం.
ఈ చిత్రం తమన్నా కాకుండా మరో హీరోయిన్ కూ స్కోప్ ఉందని సమాచారం. ఆ సెకండ్ హీరోయిన్ స్థానం బ్రెజిల్ మోడల్ గాబ్రియాలాకు దక్కింది.గాబ్రియాలా పాత్ర గరమ్ గరమ్‌గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నైట్ ఎఫెక్ట్‌లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. తొలి కలయిక 'బద్రి' తోనే సెన్సేషన్ సృష్టించిన పవన్‌కళ్యాణ్-పూరి జగన్నాథ్. 'బద్రి' తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా చేయలేదు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'కెమెరామేన్ గంగతో రాంబాబు'. 'గబ్బర్‌సింగ్' లాంటి సూపర్ హిట్ తర్వాత పవన్‌కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావటంతో మరింత క్రేజ్ వచ్చింది.


Click it and Unblock the Notifications











