పవన్ ప్రమేయం లేకుండానే పబ్లిసిటీ జరుగుతోంది

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ఓ చిత్రం చేస్తున్నారంటే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరు. అలాగే పవన్ చేత రిజెక్టు చేయబడ్డ సంపత్ నందికి సైతం అదే క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు అందరి దృష్టీ అతను తాజాగా చేయబోయే చిత్రం 'బెంగాల్‌ టైగర్‌' పైనే ఉంది. మీడియా సైతం ఈ ప్రాజెక్టుకు చాలా ప్రాముఖ్యతను ఇస్తోంది. రెగ్యులర్ గా రవితేజ చిత్రాలు ప్రారంభ స్టేజీలో ఇంత క్రేజ్ పొందటం అనేది ఎప్పుడో కానీ జరగదు. ఈ చిత్రం పవన్ కోసం తయారు చేయబడి ఆయన చేత రిజెక్టు చేయబడినదేనా, అది ఎలాంటి కథ...సంపత్ నంది ఎలాంటి హిట్ ఇస్తాడు వంటి అంశాలతో ఈ ప్రాజెక్టుకి తెలియకుండానే క్రేజ్ వచ్చేసింది. ఓ రకంగా ఈ ప్రాజెక్టుకు పవన్ ప్రమేయం లేకుండానే పబ్లిసిటీకు ఉపయోగపడుతున్నట్లుగా జరుగుతోంది.

చిత్రం విషయానికి వస్తే..

మాస్‌ ప్రేక్షకుల్ని అలరించడంపైనే దృష్టి పెడతారు రవితేజ. ఆయన సినిమాల పేర్లు అదే విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇటీవల 'బలుపు', 'పవర్‌' అని సందడి చేసిన రవితేజ త్వరలో 'బెంగాల్‌ టైగర్‌'గా అలరించబోతున్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తమన్నా హీరోయిన్. కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'బెంగాల్‌ టైగర్‌' అనే పేరును ఖరారు చేశారు. ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలవుతుంది.

Pawan's Free publicity for Ravi Teja's movie

రవితేజ మాట్లాడుతూ ''అందరినీ మెప్పించేలా సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుడు సంపత్‌ నంది. మాస్‌ అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకుల్నీ అలరించేలా కథను సిద్ధం చేశాడు. కథకు తగ్గట్టుగా 'బెంగాల్‌ టైగర్‌' అనే పేరును నిర్ణయించాము''అన్నారు. ''రవితేజతో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన మా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొంటాము''అన్నారు నిర్మాత.

''రవితేజతో సినిమా చేయాలన్న కోరిక నెరవేరుతుండటం ఆనందంగా ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాము''అన్నారు సంపత్‌ నంది.

పవన్ తో చిత్రం అనుకుని రెండేళ్లు పాటు స్క్రిప్టు వర్క్ చేసిన సంపత్ దాంతో పవన్ ని ఇంప్రెస్ చేయలేకపోయారనేది స్పష్టం అయ్యింది. దాంతో రచ్చ తర్వాత రెండేళ్లు గ్యాప్ వచ్చేసింది. ఇమ్మీడియట్ గా ప్రాజెక్టు మొదలెట్టినా అది మెటీరియలైజ్ అయ్యేసరికి ఆరు నెలలు పైగానే టైమ్ పడుతుందనుకున్నారు కానీ చాలా స్పీడుగా వర్కవుట్ చేస్తున్నారు.

ఇక..రెండోసారి కిక్‌ని పంచే ప్రయత్నంలో ఉన్నారు రవితేజ. తదుపరి చేయనున్న మరో చిత్రానికి తాజాగా పచ్చ జెండా వూపేశారు. సంపత్‌ నంది దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. 'కిక్‌ 2' పూర్తయిన వెంటనే సెట్స్‌పైకి తీసుకెళతారు. ఇందులో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారు.

రవితేజ మాట్లాడుతూ ''సంపత్‌ నంది చెప్పిన కథ చాలా బాగుంది. ఒక్కసారి వినగానే ఓకే చెప్పేశా. అన్ని వర్గాల్నీ అలరించే అంశాలున్నాయి. మాస్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులకూ నచ్చేలా సంపత్‌ నంది కథని తీర్చిదిద్దుతున్నాడు''అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X