పవన్ మళ్లీ కాశీకి ప్రయాణం

By Srikanya

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మళ్లీ కాశీకి ప్రయాణం కడుతున్నారా..అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. గతంలో తీన్ మార్ చిత్రం కోసం కాశీలో షూటింగ్ జరిపిన పవన్ ఇప్పుడు మరోసారి గోపాల గోపాల చిత్రం కోసం ప్రయాణం పెట్టుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కాశీకి ప్రయాణం పెట్టుకోనుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సృష్టి లయలకు కారణం నేనే. సమస్త లోకాన్నీ నేనే నడిపిస్తున్నా.. అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు కదా.. అయితే నా కష్టాలకూ ఆయనే బాధ్యుడు..'' అంటూ లాజిక్‌ తీశాడొకాయన. అక్కడితో ఆగలేదు. కోర్టు మెట్లెక్కాడు. న్యాయశాస్త్రంలోనూ ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. చివరికి ఆ కృష్ణుడే దిగి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కథెలా నడిచిందో తెలియాలంటే 'గోపాల గోపాల' చూడాల్సిందే.

వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌, సురేష్‌బాబు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటిలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో పవన్‌, వెంకటేష్‌ల మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ''దేవుడికీ మానవుడికీ జరిగిన సంఘర్షణ ఇది. పవన్‌ పాత్ర తీరుతెన్నులు, ఆయన పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణ'' అని చిత్రబృందం చెబుతోంది.

Pawan's Gopala Gopala goes to Varanasi

వెంకటేష్ హీరోగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో నటిస్తున్న చిత్రం గోపాల గోపాల. ఆ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఆ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గోపాల గోపాల చిత్రంలో శ్రీకృష్ణుడు కీలక భూమిక పోషిస్తాున్నారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్ ల డైలాగ్ లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 45 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు.

హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రం కిషోర్ కుమార్ దర్శకత్వంలో గోపాల గోపాల రీమేక్ చిత్రంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్, పరాష్ రావెల్ పాత్రను వెంకటేష్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ రోజున గోపాల గోపాల చిత్రం విడుదలకు సిద్దమతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X