‘దేవ దేవం భజే’ కాదు.....‘గోపాలా గోపాలా’?
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో హిందీ సూపర్ హిట్ మూవీ 'ఓ మై గాడ్' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలసిందే. ఈ చిత్రానికి 'దేవ దేవం భజే' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి 'గోపాలా గోపాలా' అనే టైటిల్ ఖరారు చేసే యోఛనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ సమాచారం వెలువడనుంది.

'ఓ మై గాడ్' సినిమాలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నటించారు. తెలుగులో అక్షయ్ కుమార్ పాత్రను పవన్ కళ్యాణ్, పరేష్ రావల్ పాత్రను వెంకటేష్ చేయబోతున్నారు. కథ విషయానికొస్తే పరేష్ రావెల్ ఓ నాస్తికుడు. అతనికి యాంటిక్స్ షాప్ ఉంటుంది. ఓరోజు అతని వ్యాపారం భూకంపం దెబ్బకు నాశనమైపోతుంది. దాంతో అతను ఇన్సూరెన్స్ వారిని ఆశ్రయిస్తారు. అయితే వాళ్లు చేతులెత్తేసి... అది భగవంతుడు పని కాబట్టి తమకేం సభందం లేదని చెప్తారు. దాంతో కోపం తెచ్చుకున్న అతను భగవంతుడుపై కేసు వేస్తాడు. అప్పుడు భగవంతుడు వచ్చి ఏం చేస్తాడు అనేది మిగతా కథ. భగవంతుడి పాత్రలో అక్షయ్ కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. వెంకీ జోడీగా శ్రీయను ఎంపిక చేసారు. అదే విధంగా వెంకీ అసిస్టెంట్ పాత్రకు కృష్ణుడిని తీసుకున్నారు. ఇప్పటికే రామానాయుడు సినీ విలేజ్‌లో సినిమాకు సంబంధించిన మార్కెట్ సెట్ సైతం వేసారు. మరికొన్ని రోజుల్ల సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 'ఓ మై గాడ్' ఒరిజినల్ వెర్షన్లో మిథున్ చక్రవర్తి లీలాధర్ స్వామిజీ పాత్రలో నటించారు. తెలుగులో వెర్షన్లోనూ ఆయన అదే పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.
సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్లలో సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మించబోతున్నారు. 'తడాఖా' ఫేం డాలీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తారు.


Click it and Unblock the Notifications











