పవన్ 'అత్తారింటికి దారేది' లీక్ డైలాగ్స్ (కొత్తవి)
ప్రణీత,పవన్ మధ్య డైలాగు
ప్రణీత: "నువ్వు ఐ మూలగా(డైయగ్నల్) అంటూ అమ్మాయిలకు ఏదో లెక్చర్ ఇస్తావంటగా....?"
పవన్: "అది అంతా అలాంటి అండర్ కలర్ బ్యూటీస్ కి బుజ్జీ...నువ్వు ఎటు చూసినా...ఎలా చూసినా పిల్లోడు నాశనం."
అలాగే పవన్ ,అలీ మధ్య డైలాగు
అలీ - "ఈ పిల్ల ని బౌండరీ దాటించటం అంత ఈజీ కాదు, చాలా భారీ ఫీల్డింగ్ పెట్టాడు వాడు".
పవన్- "చూడమ్మా సింగిల్ కొట్టాలి అనుకున్నవాడే ఫీల్డర్ ని చూసి ఆడతాడు. నాలాగ సిక్స్ కొట్టాలి అని ఫిక్స్ అయిన వాడికి ఫీల్డర్ ఎక్కడున్న పెద్దగా ఏ ఫీలింగ్ ఉండదు ".
ఇక ఈ చిత్రం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి.త్వరలో 25 రోజుల షెడ్యూల్ నిమిత్తం యూరప్ వెళ్లేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా స్పెయిన్‌లోనూ చిత్రీకరణ జరపనున్నారు.
'వన్ లైనర్' డైలాగులకూ, కామెడీకీ పెట్టింది పేరైన త్రివిక్రమ్ ఈ సినిమాలోనూ వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ, ఇటీవలే 'మిర్చి'లో ప్రభాస్ తల్లిగా కనిపించిన నదియా కీలక పాత్రలు చేస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 'జల్సా' వంటి హిట్ సినిమా తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తయారవుతున్న ఈ సినిమాపై అంచనాలు అసాధారణంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications












