twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ ‘పంజా’ ఆ సినిమాకు కాపీనా?

    By Bojja Kumar
    |

    ఈ మధ్య ఏ తెలుగు సినిమా తీసుకున్నా ఏదో ఒక హాలీవుడ్ మూవీకి కాపీ అనే విషయం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. కొందరు దర్శకుడు తాము కాపీ కొడుతున్నామనే విషయాన్ని ముందే చెప్పేస్తే...మరికొందరేమో సినిమా విడుదలయ్యాక దొరికి పోయి పరువు పోగొట్టుకుంటున్నారు. తాము కాపీ కొట్టామనే విషయాన్ని దర్శకులు గోప్యంగా ఉంచుతుండటంతో సినిమా విడుదలైన తర్వాత హీరోలు అభిమానుల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

    పవన్ కళ్యాణ్ తాజా సినిమా 'పంజా" కూడా హాలీవుడ్ సినిమాకు కాపీ అనే పుకార్లు ఫిల్మ్ నగర్ లో షికారు చేస్తున్నారు. సినిమా ట్రైలర్ బట్టి ఈ సినిమా హాలీవుడ్ సినిమా Carlito's Way కు కాపీ అనే వాదన వినిపిస్తోంది. దర్శకుడు విష్ణు వర్ధన్ ఈ సినిమా ఆధారంగానే పంజా కథను అల్లుకున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో? సినిమా విడుదలైతే గానీ తెలీదు.

    పంజాలో పవన్ కళ్యాణ్ సరసన సారా జైన్ డియాస్, అంజనా లవానియాలు నటిస్తున్నారు. నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతానికి పవన్ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

    English summary
    Now, the latest buzz is that it has striking resemblance to Hollywood gangster classic Carlito's Way movie. So they say that Vishnu Vardhan lifted the idea from it. This is because of the importance given to the romance thread in Panjaa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X