twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టుడే రిలీజ్ పవన్ కళ్యాణ్ 'తీన్ మార్' టాక్ ఏంటి?

    By Srikanya
    |

    పవన్ కళ్యాణ్,త్రిష కాంబినేషన్ లో జయంత్ రూపొందించిన తీన్ మార్ చిత్రం ఈ రోజు(గురువారం)విడుదలైంది.ప్రీమియర్ షో లతో ప్రారంభమైన ఈ చిత్రం టాక్ పాజిటివ్ గా ఉంది.అంతటా మంచి హిట్ టాక్ గా మరో ఖుషీగా అభివర్ణిస్తున్నారు. ఇక లవ్ ఆజ్ కల్ కీ తీన్ మార్ కీ మేజర్ గా చెప్పుకునే తేడాలు ఏమిటంటే..వారణాసి ఎపిసోడ్ ఈ రెండు సినిమాలకీ పెద్ద పోలిక ఉండదు. అక్కడ సైఫ్ అలీ ఖాన్ ఓ సైలెంట్ సర్దార్జి అయితే ఇక్కడ పవన్ విప్లవ భావాలున్న అర్జున్ పాల్వాయ్ అనే స్టూడెంట్ లీడర్.అలాగే కృతి కర్బంద నుంచి ఎలా అర్జున్ పాల్వాయ్ ప్రేమను పొందాడన్నది పరేష్ రావెల్ మైకెల్ కి వివరిస్తూంటాడు.

    అలాగే ఈ చిత్రంలో త్రిష స్టైలిష్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది.కృతి కర్భంద బ్రాహ్మిణ స్త్రీగా సంప్రదాయబద్దంగా అలరిస్తుంది.ఇక మైకెల్ వేలాయుధం పాత్ర ని లవ్ ఆజ్ కల్ లోది ఉన్నది ఉన్నట్లు తీసుకున్నారు.అక్కడ పవన్ పరేష్ రావెల్ హోటల్లో చెఫ్ గా పనిచేస్తూంటాడు.అక్కడే త్రిష ఓ ఆర్కియోలజిస్ట్.వేలాయుధం గర్ల్ ప్రెండ్. వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఫీలవరు.విడిపోయిన తర్వాత ఆమె ఇండియా వచ్చేసి మైసూల్ లో పనిచేస్తూంటుంది.వేలాయుధం అమెరికా వెళ్ళిపోతాడు. త్రిష సోనూ సూద్ ని వివాహం చేసుకుంటుంది కానీ పవన్ ని మర్చిపోలేదు. ఇదంతా పరేష్ రావెల్ ప్లాష్ బ్యాక్ లో నేరేట్ చేస్తూంటాడు.

    ఇక ఇప్పటికే హిట్టయిన పాటలకు ధియోటర్ లో మంచి స్పందనే వస్తోంది.త్రివిక్రమ్ పంచ్ లు చాలా చోట్ల పేలి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.టెక్నికల్ గానూ దర్శకుడు ఈ చిత్రాన్ని మంచి స్టాండర్డ్స్ లో రూపొందించాడు.ఇక చిత్రం ఫస్టాఫ్ చాలా బాగుందంటున్నారు.సెకెండాఫ్ కొద్దిగా స్లోగా ఉన్నా ఫైనల్ కి వచ్చేసరికి ఎమోషనల్ గా బైండవోవర్ చేస్తోందని టాక్. కామిడీ ఈ చిత్రంలో మంచి ప్లస్ పాయింట్ అవుతుంది.అలాగే ఎ సెంటర్లు,మల్టీ ప్లెక్స్ లలో ఈ చిత్రం గ్యారెంటీగా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్తున్నారు.ఏదైమైనా ఈ మద్య కాలంలో వరసగా వస్తున్న పవన్ చిత్రాలలాగ నిరాశపరచలేదని చెప్తున్నారు.

    English summary
    The first half of the Teen Maar movie is good and second half of the movie will end in a high note but bit emotional. The songs of the movie has considered to be the strength of the movie. Comedy in the movie is damn good.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X