'ఖుషి' లింక్ తో...పవన్,త్రివిక్రమ్ టైటిల్??
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ చిత్రం టైటిల్ అత్తారింటికి దారేది అనేది ఫిక్స్ అనుకుంటున్న సమంయంలో ఈ టైటిల్ మార్చనున్నారని వార్తలు వెలుబడుతున్నాయి. ఈ సారి టైటిల్ గా ఖుషి ని గుర్తు చేసేలా..అందులో హీరో పేరు అయిన సిద్దార్ధ అని పెడదామనుకుంటున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అందులో పవన్ పేరు సిద్దు..సిద్దార్ధ రాయ్ అనేది చాలా పాపులర్ కావటంతో వెంటనే ఫ్యాన్స్ కనెక్టు అయ్యే అవకాసం ఉందని ఈ పేరు పరిశీలనలో ఉందని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రానికి మొదట్నుంచీ సరదా, అత్తారింటికి దారేది అనే పేర్లను చిత్ర వర్గాలు పరిశీలిస్తున్నాయి. అయితే పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్ యాప్ట్‌గా వుంటుందని భావించారు చిత్రబృందం. ఇంకొంచెం సమయం తీసుకుని త్వరలోనే టైటిల్‌ని అనౌన్స్ చేద్దామని అనుకుంటున్న తరుణంలో సమంతా తన తాజా చిత్రానికి 'అత్తారింటికి దారేది' అనే టైటిల్‌ని నిర్ణయించినట్లుగా ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది. ఇంకేముంది...టైటిల్ గురించి పవన్ అభిమానుల్లో చర్చ మొదలైంది.
తమ అభిమాన హీరో చిత్రానికి ఇదేమీ టైటిల్ అని పవన్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారట. అంతేకాదు టైటిల్‌ను ఖచ్చితంగా మార్చాలని దర్శక నిర్మాతలకు సూచించారట. దీంతో యూనిట్ వర్గాలు కూడా ఆలోచనలో పడ్డాయని చెబుతున్నారు. ఇక ఈ సమస్యకు కారణం సమంతా తొందరపడి తన ట్విట్టర్ అకౌంట్‌లో ప్రకటించడమేనని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయని తెలిసింది. అయితే ఈ క్యూట్‌గాళ్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా స్పెయిన్‌లో ఎంజాయ్ చేస్తోందట. అంతే కాకుండా 'షూటింగ్ అంతా నవ్వులతో గడిచిపోతుందని, సినిమాని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది ఈ కేరళ భామ.


Click it and Unblock the Notifications












