అర్జున్ పాల్వాయ్ గా పవన్ కళ్యాణ్ అదుర్స్
లవ్ ఆజ్ కల్ రీమేక్ గా రూపొందుతున్న పవన్ కళ్యాణ్ తాజా చిత్రం తీన్ మార్ లో రెండు పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రలకు ఎప్పటిలాగానే పవన్ వెరైటీ పేర్లు పెట్టారు. అందులో ఒకటి అర్జున్ పాల్వాయ్. ఆ పాత్ర తెలంగాణా రెబెల్ స్టూడెంట్ పాత్ర. పరేష్ రావెల్ తో ఉన్న ప్లాష్ బ్యాక్ లో ప్రేమ కోసం పోరాటం చేస్తుంది. ఇక రెండో పాత్ర మైఖల్ వేలాయుధమ్. ఈ పాత్ర అల్ట్రా మోడరన్ గా సాగుతుంది. చాలా పాస్ట్ గా ఉండే ఈ పాత్రకి ఎమోషన్స్ ఏమి ఉండవు. ప్రేమ, రిలేషన్ షిప్,జీవితం పట్ల ఏ విధమైన ఎమోషన్స్ ఉండవు. కేవలం తన జీవితానికో లక్ష్యం పెట్టుకుని దానికోసమే పనిచేస్తూంటాడు. ఈ రెండు పాత్రలూ ఒకదానికొకటి పోలికలేకుండా సాగి సినిమాను ఓ స్ధాయికి తీసుకెళ్తాయని భావిస్తున్నాడు. అలాగే పవన్‌కళ్యాణ్ నటన, త్రిష గ్లామర్, త్రివిక్రమ్ మాటలు, మణిశర్మ సంగీతం, జయంత్ టేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఈ చిత్రాన్ని రికార్డు హిట్‌గా నిలబెట్టడం ఖాయం అంటున్నారు. త్రివిక్రమ్ రచన చేస్తున్న ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ డైరక్ట్ చేస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ దీనిని నిర్మిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్ గా కనిపంచనున్నారు. ఈ చిత్రానికి కోప్రొడ్యూసర్: బడే రవికిరణ్, సమర్పణ: శివబాబు.


Click it and Unblock the Notifications











