మరో హీరోపై ఉన్న కసితో రెచ్చిపోతున్న పవన్ కళ్యాణ్ డైరక్టర్
పవన్ కళ్యాణ్ ని షాడో గా చూపించటానకి విష్ణు వర్ధన్ రాత్రింబవళ్ళు కష్టపడుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కలకత్తాలో షూటింగ్ జరుపుకుంటున్నఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకూ జరగనుంది. ఆ షెడ్యూల్ లోనే సినిమాలో ఎయిటీ పర్శంట్ పూర్తి కానుంది. విష్ణు వర్దన్ టేకింగ్,స్పీడు చూసి పవన్ షాక్ అయ్యారుట.ఇక్కడ ఒక్కో సీన్ తీయటానకి రకరకాల యాంగిల్స్, షాట్స్ పేరుతో రోజుల తరబడి చేయటం,చివరకు అవి భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ కావటం జరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ అతని వర్క్ ని గమనించాట్ట.
అంతేగాక ఇప్పటివరకూ తీసిన రషెష్ చూసి చాలా సంతృప్తి ఫీలయ్యాట్ట.అతనితో మరో సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నాడని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఇక భిళ్లా సినిమాతో స్టైలిష్ డైరక్టర్ గా ఎదిగిన విష్ణు వర్దన్ కిది మొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రం తో మహేష్ వంటి పెద్ద హీరోల సినిమాలు పట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు.అందులోనూ ఇదే దర్శకుడుతో భిళ్ళా చిత్రం చేసిన అజిత్ ఈ చిత్రం ప్రీక్వెల్ అంటే కథ విని వద్దన్నాడు.దాంతో ఎలాగయినా హిట్టు కొట్టి చూపాలనే కసితో ఉన్నాడు విష్ణు వర్దన్.అదే పవన్ కి ప్లస్ అవుతోంది.


Click it and Unblock the Notifications











