పవన్ కళ్యాణ్ పక్కకి, ఇక మహేష్ బాబే దేవుడు?
హైదరాబాద్: హిందీలో సూపర్ హిట్ అయిన 'ఓ మై గాడ్' చిత్రానికి తెలుగులో రీమేక్ రాబోతున్న సంగతి తెలిసిందే. హిందీలో అక్షయ్ కుమార్, పరేవష్ రావల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలుగులో......సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో ఈచిత్రాన్ని ప్లాన్ చేసారు. పవన్ కళ్యాణ్ డేట్స్ కూడా ఇచ్చారు. అయితే ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో ఆయన ఈ సినిమా చేస్తాడా? లేదా? అనేది సందేహంగా మారింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్లేసులో నిర్మాతలు మహేష్ బాబును తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే హిందీలో అక్షయ్ కుమార్ పోషించిన దేవుడి పాత్రను తెలుగులో మహేష్ బాబు పోషిస్తాడని స్పష్టమవుతోంది. పరేష్ రావల్ పోషించిన పాత్రను వెంకటేష్ పోషించనున్నారు. త్వరలోనే ఈ విషయమై నిర్మాతల నుండి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి దర్శకుడు, ఇతర తరాగణం, టెక్నీషియన్స్ ఖరారు కావాల్సి ఉంది.
మహేష్ బాబు ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రం చేస్తూ బిజీగా గడుపుతున్నారు. దీంతో పాటు ఆయన కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు. దీని తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసినిమా చేసే అవకాశం ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మహేష్ బాబు 'ఓ మై గాడ్' తెలుగు రీమేక్ కోసం డేట్ష్ ఇస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











