పవన్, రాజమౌళి కాంబినేషన్ ఖరారు!?
రాజమౌళి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో చిత్రం గురించి అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మొన్న పంజా ఆడియో పంక్షన్ లో సైతం ఈ ప్రసక్తి వచ్చింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు ఖరారైందని సమాచారం. రీసెంట్ గా రాజమౌళి వెళ్లి పవన్ ని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించాడని,పవన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇక డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకు వచ్చారు. దానయ్య వద్ద పవన్ డేట్స్ ఉండటంతో ఈ కాంబినేషన్ ని ముందుకు తీసుకెళ్ళగలిగాడని తెలుస్తోంది. అయితే వచ్చే సంవత్సరమే అంటే 2013లో మాత్రమే ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ లోగా పవన్ తను కమిట్ అయ్యిన ప్రాజెక్టులు ఫినిష్ చేసుకోవాలి. అలాగే రాజమౌళి సైతం ..ప్రభాస్ తో చేయబోయే చిత్రం ఫినిష్ చేసుకుని ఈ చిత్రం స్క్రిప్టుని రెడీ చేసుకుని వస్తారు.
ఇక పంజా ఆడియో పంక్షన్ లో...పవన్ ఈ టాపిక్ పై మాట్లాడుతూ..రాజమౌళితో సినిమా ఎప్పుడు అని అభిమానులందరూ అడుగుతున్నారు. రాజమౌళితో సినిమా చేయాలని నాకూ ఉంది. దేశం గర్వించే సినిమా 'మగధీర' తీసినప్పుడు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించాను.అయితే నేనెవర్నీ సినిమా చేయమని నోరు తెరిచి అడగలేను.అన్నీ కలిసి రావాలి.ఆయనతో సినిమా చేయాలంటే సరైన సమయం రావాలని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం పంజా ఆడియో పంక్షన్ లో ఈ విషయం చెప్పారు.ఇక గతంలోనూ రాజమౌళి ఈ విషయమై మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రపోజల్ ప్రస్తుతానికి లేదని, ఒకవేళ మా కాంబినేషన్ లో సినిమాలో సెట్ అయితే ఆ విషయాన్ని నేనే చెపుతానని రాజమౌళి ఇంతకుముందో సారి ట్విట్టర్ లో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











