twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవా బీచ్‌లో పాయల్ రాజ్‌పుత్, రవితేజ.. ఇదీ అసలు సంగతి!

    |

    ఇటీవలే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో డిసాస్టర్ ఖాతాలో వేసుకున్న రవితేజ.. ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ సాధించాలనే కసితో వీఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కోరాజా సినిమా చేస్తున్నాడు. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.

    ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ దాకా చేరుకుంది. ఈ ఒక్క షెడ్యూల్ పూర్తి చేస్తే సినిమా షూటింగ్ అంతా ఫినిష్ అయినట్లే. అయితే తాజా సమాచారం మేరకు ఈ షెడ్యూల్ గోవాలో జరగనుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 2 నుంచి మొదలుకానున్న ఈ షెడ్యూల్‌లో గోవా బీచ్ సహా, పలు అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరపనున్నారట. ముఖ్యంగా పాయల్ రాజ్‌పుత్, రవితేజల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు షూట్ చేయనున్నారని తెలుస్తోంది.

    Payal Rajput and Ravi Tejas romance in Goa Beach

    ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా డిస్కోరాజా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన వచ్చింది. ఇక డిసెంబర్ 20వ తేదీన డిస్కో రాజా సినిమా విడుదల కానుందని అఫీషియల్ గా ప్రకటించారు యూనిట్ సభ్యులు. ఈ సినిమా టీజర్ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 5న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. చిత్రంలో రవితేజ రెండు డిఫెరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. వృద్దుడిగా, యువకుడిగా రవితేజ నటన అబ్బురపరచనుందని తెలుస్తోంది.

    English summary
    Mass Maharaj Raviteja's new movie is Disco Raja which is directed by Vi Anand. Now payal rajputh shered a selfi with raviteja. This movie is released on december 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X