twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క ఓ వైపు, పాయల్ రాజ్‌పుత్ మరోవైపు.. రొమాన్స్ ఇక రచ్చే!

    |

    కింగ్ నాగార్జున చివరగా నటించిన చిత్రం దేవదాస్. దేవదాస్ తర్వాత నాగ్ మరో చిత్రానికి సైన్ చేయలేదు. త్వరలో నాగ్ తన సూపర్ హిట్ మూవీ మన్మథుడు చిత్ర సీక్వెల్ లో నటించబోతున్నాడు. మన్మథుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 టైటిల్ తో రాహుల్ రవీంద్రన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. కథ మొత్తం సిద్ధం కావడంతో చిత్ర యూనిట్ షూటింగ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్, హీరోయిన్ల గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

    మన్మథుడు ఘనవిజయం

    మన్మథుడు ఘనవిజయం

    2002 లో విడుదలైన మన్మథుడు చిత్రం నాగార్జున బిగ్గెస్ట్ హిట్ చిత్రాలతో ఒకటిగా నిలిచింది. ఫన్, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రంలో నాగార్జున, సోనాలి బింద్రే జంటగా నటించారు. అన్షు మరో హీరోయిన్ గా నటించింది. విజయ్ భాస్కర్ ఈ చిత్రానికి దర్శత్వం వహించారు. ఇవన్నీ మన్మథుడు చిత్రంలో ఒక ఎత్తైతే,, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్ మరో ఎత్తు. ఈ చిత్రంలో కామెడీ పంచ్‌లు అందరిని తెగ ఆకట్టుకున్నాయి.

    పోర్చుగల్

    పోర్చుగల్

    మన్మథుడు 2 చిత్ర షూటింగ్ మార్చి మొదటి వారంలో పోర్చుగల్ లో ప్రారంభం అవుతుందట. దాదాపు నెలరోజుల పాటు చిత్ర యూనిట్ అక్కడే కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ రవీంద్రన్ కూడా ఈ చిత్రాన్ని రొమాంటిక్ యాంగిల్ లోనే చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    రొమాన్స్ రచ్చే

    రొమాన్స్ రచ్చే

    మన్మథుడు తరహాలోనే మన్మథుడు 2 లో కూడా ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ఓ హీరోయిన్ గా ఎంపికైంది. మరో హీరోయిన్ గా అనుష్క నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగ్ నటించిన సూపర్ చిత్రంతో అనుష్క హీరోయిన్ గా పరిచయం అయింది. దీనితో అనుష్కకు నాగార్జునతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన చిత్రాల్లో గెస్ట్ రోల్ లో నటించడానికి కూడా అనుష్క వెనుకాడదు. అనుష్క ఈ చిత్రంలో నటించేది ఖాయమైతే నాగ్, అనుష్క మధ్య రొమాన్స్ హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది.

    ప్రతిష్టాత్మకంగా

    ప్రతిష్టాత్మకంగా

    మన్మథుడు సూపర్ హిట్ మూవీ. పైగా తన సొంత నిర్మాణంలో సీక్వెల్ తెరకెక్కుతుండడంతో మన్మథుడు 2ని నాగార్జున చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. అన్ని పక్కాగా రూపొందించి మన్మథుడుని మించేలా రూపొందించాలని భావిస్తున్నారు. మన్మథుడు చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మన్మథుడు 2కి కూడా అతడినే కొనసాగిస్తారేమో చూడాలి.

    English summary
    Payal rajput and Anushka Shetty to romance with Nagarjuna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X