ఐదు నిమిషాలకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసిన హీరోయిన్!
'ఆర్ఎక్స్ 100' విడుదల తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేరు మార్మోగి పోతోంది. ఈ సినిమాలో ఘాటైన ముద్దు సీన్లలో నటించడం ద్వారా పాయల్ ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పక తప్పదు. రెమ్యూనరేషన్ (రూ. 6 లక్షలు) గురించి పట్టించుకోకుండా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలనే కసితో ఆమె తెగింపుగా నటించింది. ఆ తెగింపే పాయల్‌కు వరుస అవకాశాలు తెచ్చి పెడుతోంది. దీంతో ఈ బ్యూటీ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసింది.
ఆ సంగతి పక్కన పెడితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జీ తెలుగు కామెడీ అవార్డ్స్ వేడుకకు పాయల్‌ను కూడా ఇన్వైట్ చేశారు. ఈ అవార్డుల కార్యక్రమంలో స్టేజ్ అప్పియరెన్స్ ఇచ్చినందుకుగాను రూ. 5 లక్షలు చార్జ్ చేసిందట. ఈ విషయం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. కేవలం ఐదు నిమిషాల అప్పియరెన్స్ కోసం తన మొదటి సినిమా రెమ్యూనరేషన్‌తో సమానమైన మొత్తం తీసుకోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

జీకామెడీ అవార్డ్స్ వేడుకకు లైట్ పింక్ కలర్ డ్రెస్సులో అదిరిపోయే లుక్‌తో హాజరైన పాయల్... ఈ అవార్డుల వేడుకకే హైలెట్ అవ్వడంతో పాటు అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమెతో పాటు ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ కూడా హాజరయ్యారు.
కాగా... కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఎక్స్ 100' చిన్న సినిమాల కేటగిరీలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నిర్మాతలకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టిన ఈ మూవీ ఇటీవలే 25 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.


Click it and Unblock the Notifications











