‘ఎన్టీఆర్ బయోపిక్’లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్?
ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఓ సంచలన వార్త తాజాగా ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ను ఓ కీలకమైన పాత్రకు ఎంపిక చేశారట. ఎన్టీఆర్ బయోపిక్ మొదిటి భాగం 'కథానాయకుడు'లో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది.
రామారావు సినీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను ఫోకస్ చేసే క్రమంలో అప్పట్లో ఆయనతో కలిసి నటించిన పలువురు హీరోయిన్ల పాత్రను సైతం ఇందులో చూపించనున్నారు. శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ ఇప్పటికే ఎంపికన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సినీ జీవితంలో మరో ముఖ్యమైన నటి జయసుధ. ఈ పాత్ర కోసం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ... పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించిన పాయల్... తొలి చిత్రంతోనే అందం పరంగా, నటన పరంగా, ముద్దు సీన్ల పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం రెండు పంజాబీ చిత్రాలతో పాటు, తెలుగులో ఒకటి, తమిళంలో ఒక సినిమా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











