Payal Rajput : ప్రేమ గురించి ఆర్ఎక్స్ 100 బ్యూటీ పోస్ట్‌లు .. హింట్ ఇచ్చేసినట్లేనా, ఎవరో అతగాడు?
అందం , అభినయం ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లకు కాలం కలిసి రావడం లేదు. పర్ఫెక్ట్ హీరోయిన్‌గా మార్క్స్ వేయించుకున్నా అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. ఇదే కోవలోకి వస్తారు పాయల్ రాజ్‌పుత్. ఆర్ఎక్స్ 100 మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పత్ అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించారు. అందులోని ఆమె పోషించిన ఇందూ రోల్ ఇప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సినిమాతో టాలీవుడ్‌లో పాయల్ టాప్ హీరోయిన్‌గా వెలిగిపోతారని చాలా మంది అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
ఆర్ఎక్స్ 100 తర్వాత అన్ని అదే తరహా పాత్రలు ఆమెను వెంటాడాయి. అయినప్పటికీ సెలెక్ట్‌డ్‌గా మూవీస్ చేసుకుంటూ వచ్చారు పాయల్ రాజ్‌పుత్. ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, మంగళవారం, రక్షణ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. గతేడాది వచ్చిన మంగళవారం మూవీ పాయల్ రాజ్‌పుత్‌కు మంచి పేరు తీసుకొచ్చింది.

నటనకు ప్రాధాన్యమున్న పాత్రతో పాటు అందులో బోల్డ్ సీన్స్‌లోనూ పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయి నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన స్కూల్ డేస్ నాటి అనుభవాలను పంచుకుంది. చిన్నప్పుడు ఓ అబ్బాయిని తాను పిచ్చి పిచ్చిగా ప్రేమించానని.. అతనిని చూడగానే తనలో ఏదో తెలియని ఆనందం కలిగిందని పాయల్ తెలిపారు. ఈ అనుభూతినే ప్రేమగా భావించానని , టెన్త్ పూర్తవుతున్న చివరి రోజుల్లో అతనికి ప్రపోజ్ చేయగా.. ఆ వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదని పాయల్ గుర్తుచేసుకున్నారు.
మంగళవారం సినిమా కోసం అనారోగ్యంతో బాధపడుతూనే నటించారట పాయల్. షూటింగ్ సమయంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డానని.. వాటర్ తక్కువగా తాగడం వల్లే తనకు ఇబ్బందులు వచ్చాయని ఆమె తెలిపారు. నిన్నగాక మొన్న వచ్చిన హీరోయిన్స్ కూడా ప్రేమలో పడుతున్న రోజుల్లో దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న పాయల్ రాజ్‌పుత్ కూడా ప్రేమలో పడినట్లుగా పలుమార్లు సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి.

మొన్నామధ్య పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాయల్ రాజ్‌పుత్ పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో వీటిపై ఆమె స్వయంగా స్పందించారు. ఈ రూమర్స్‌ని చూసి తాను బాగా నవ్వుకున్నానని .. ఆ వార్తలు నిజమైతే బాగుండు అనిపించిందని ఆసక్తికరంగా ఆన్సర్ ఇచ్చారు. తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని , అవకాశం వస్తే ఆయనతో కలిసి నటిస్తానని వెల్లడించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడూ తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ప్రేమను మీరు ఎలా పలుకుతారని పోస్ట్ పెట్టిన ఆమె.. తాను దానిని పలకనని, ప్రేమను అనుభవిస్తానని పేర్కొంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పాయల్ రాజ్‌పుత్ ప్రేమలో పడినట్లుగా హింట్ ఇచ్చేశారని, ఆమెను ప్రేమలో దించిన ఆ వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు పోస్ట్‌లు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











