Peddi: ‘పెద్ది' క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్.. రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'పెద్ది'. ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. ఇప్పటికే టీజర్, గ్లింప్స్, పాటలతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఉప్పెనతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చిబాబు.. ఈసారి మరింత భారీ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో పిచ్చెక్కించే ట్విస్ట్ ఉండబోతున్నాయంట. ఇంతకీ ట్విస్ట్ ఏంటీ? ఆ సర్ఫ్రైజ్ ఏంటీ?

Also Read
సీక్రెట్ పెళ్లి.. ఏడాది సహజీవనం.. బ్రేకప్ పై రీతూ చౌదరి క్లారిటీ
సీక్రెట్ పెళ్లి.. ఏడాది సహజీవనం.. బ్రేకప్ పై రీతూ చౌదరి క్లారిటీ

పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ , బాలీవుడ్ నటుడు దివ్వేందు, అలాగే జగపతిబాబు, సత్య వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

Peddi Ram Charan Film Climax Twist Buzz Special Song Update Goes Viral

గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిగా రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్‌లో ఆయన లుక్, ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగ్‌లు, అలాగే క్రికెట్ షాట్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా కోసం చరణ్ చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.

Recommended For You
Singer Mangli: బూతు పాట వివాదం.. మంగ్లీ కీలక నిర్ణయం.
Singer Mangli: బూతు పాట వివాదం.. మంగ్లీ కీలక నిర్ణయం.

అయితే, ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది సినిమా క్లైమాక్స్ గురించి వినిపిస్తున్న గుసగుసలు. బుచ్చిబాబు తన తొలి సినిమా ఉప్పెనలో ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్టుగానే .. 'పెద్ది'లో కూడా క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇటీవల బయటకు వచ్చిన ఓ ఫోటోలో చరణ్ బల్క్ బాడీతో కనిపించగా, కాళ్లు స్పష్టంగా కనిపించకపోవడం గమనార్హం. దీంతో కథలో ఏదైనా షాకింగ్ ఎలిమెంట్ ఉండబోతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇది కేవలం ఫోటో యాంగిల్ మాత్రమేనా? లేదా సినిమాలో ఏదైనా కీలక ట్విస్టా? అన్నది ఆసక్తికరంగా మారింది.

You May Also Like
'ఉస్తాద్' కోసం పవన్ కళ్యాణ్‌కు ఊహించని రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
'ఉస్తాద్' కోసం పవన్ కళ్యాణ్‌కు ఊహించని రెమ్యూనరేషన్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత

మరోవైపు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌పై కూడా పెద్ద ప్లానింగ్ జరుగుతున్నట్లు సమాచారం. సాధారణంగా ఒక హీరోయిన్తో చేసే ఐటెం సాంగ్‌కు బదులుగా, ఈ మూవీలో ఒకేసారి నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లతో భారీ డాన్స్ నంబర్ ప్లాన్ చేస్తున్నారట. రామ్ చరణ్ డాన్స్‌కు పేరుగాంచిన విషయం తెలిసిందే. అలాంటి స్టార్‌తో కలిసి పలువురు హీరోయిన్లు స్టెప్పులు వేస్తే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Sreeleela: రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? శ్రీలీల క్లారిటీ
Sreeleela: రంగస్థలం మహేష్ మిస్ బిహేవ్ చేశాడా? శ్రీలీల క్లారిటీ

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా, ఇంకా పదిరోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో స్పెషల్ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఈ పాట కోసం ఏఆర్ రెహమాన్ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఎనర్జిటిక్ ట్యూన్ సిద్ధం చేశారని టాక్ వినిపిస్తోంది.

ఆ రూల్ బ్రేక్.. నాపై ఆ ఆశలు పెట్టుకోవద్దంటున్న శ్రీలీల..
ఆ రూల్ బ్రేక్.. నాపై ఆ ఆశలు పెట్టుకోవద్దంటున్న శ్రీలీల..

ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న 'పెద్ది'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందా? బుచ్చిబాబు మరోసారి క్లైమాక్స్ ట్విస్ట్‌తో మ్యాజిక్ చేస్తాడా? అన్నది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా గురించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

More from Filmibeat

Read more about: peddi ram charan buchi babu sana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X