Peddi: శృతిహాసన్‌కి భారీ రెమ్యునరేషన్.. రామ్‌చరణ్‌తో ఐటెం సాంగ్‌కి పారితోషికం ఎన్ని కోట్లంటే?
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా విడుదలపై గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రావాల్సిన ఈ మాస్ ఎంటర్‌టైనర్.. అనేక వాయిదాలు పడుతూ అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తోంది. సినిమాను మించి ఇందులోని ఐటెం సాంగ్ మరింత చర్చనీయాంశమైంది. పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చి.. ఎవరో చేస్తారో అర్ధంకాక సస్పెన్స్ నెలకొంది. అయితే చివరికి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేతుల్లోకి వెళ్లింది. మరి పెద్దిలో ఐటెం సాంగ్ కోసం ఈ ముద్దుగుమ్మ పారితోషికంగా ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ఈ వివరాల్లోకి వెళితే..
పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

తొలుత ఏప్రిల్ 30న పెద్ది సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ పూర్తి కాకపోవడం, వేసవి కాలం కావడంతో మరింత ఆలస్యమైంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఐటెం సాంగ్ చిత్ర యూనిట్‌ను ముప్పు తిప్పలు పెట్టింది. పలువురు హీరోయిన్లు రామ్ చరణ్ సరసన ఆడిపాడతారని వార్తలు వచ్చినప్పటికీ ఎవరూ సెట్ కాలేదు. దాంతో షూటింగ్ పెండింగ్‌లో పడి సినిమా వాయిదా పడింది. మేలో సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసి జూన్‌లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఫిలింనగర్ వర్గాల చెబుతున్నా దానిని బట్టి జూన్ 25న వరల్డ్ వైడ్‌గా పెద్ది ప్రేక్షకుల ముందుకు రానుంది.
పెద్దిలో అందరి దృష్టిని ఆకర్షించింది, చరణ్ అభిమానులను టెన్షన్ పెట్టింది ఐటెం సాంగ్. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న పెద్దిలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటే బాగుంటుందని దర్శకుడు బుచ్చిబాబు భావించారు. దీనికి తగినట్లుగానే పెద్దిలో తొలుత తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ చేయబోతన్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్లేస్‌లోకి మృణాల్ ఠాకూర్ వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా ఈ ప్లేస్‌లోకి సంయుక్త మీనన్ వచ్చింది.
రేపోమాపో రాం చరణ్‌తో కలిసి సంయుక్త మీనన్ ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటోందని ప్రచారం జరిగింది. కట్ చేస్తే చరణ్‌తో ఆడిపాడే అవకాశం శృతి హాసన్ దక్కించుకున్నారు. వీరిద్దరూ గతంలో ఎవడు సినిమాలో జంటగా నటించారు. అలాగే శృతి హాసన్‌కు గతంలో పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసిన అనుభవం ఉంది. ఆగడు, హాయ్ నాన్న సినిమాలలో ఆమె మాస్ సాంగ్స్ చేసి అలరించారు. పెద్ది షూటింగ్‌లో పాల్గొనేందుకు శృతిహాసన్ చెన్నై నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ - శృతిహాసన్‌ల కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేసి రెడీగా ఉంచారట. అలాగే సాంగ్ కోసం సెట్‌ను కూడా చాలా గ్రాండియర్‌గా డిజైన్ చేశారు. చరణ్ మాస్ మూవ్‌మెంట్స్‌కు శృతిహాసన్ అందాలు కూడా తోడైతే ఈ సాంగ్ అదరిపోతుందని భావిస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ ఫినిష్ చేసి పెద్దికి గుమ్మడికాయ కొట్టేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఎందరో ముద్దుగుమ్మలను దాటి పెద్దిలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న శృతిహాసన్.. ఈ పాట కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్నది కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న దానిని బట్టి పెద్దిలో ఐటెం సాంగ్ కోసం శృతి దాదాపు 3 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కేవలం 5 నిమిషాల పాటకు శృతి ఈ రేంజ్‌లో డిమాండ్ చేయడం ఆమె క్రేజ్‌ను తెలియజేస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications