Janhvi Kapoor: జాన్వీకపూర్‌కు రికార్డ్ రెమ్యునరేషన్.. పెద్ది మూవీకి ఎన్ని కోట్ల పారితోషికమంటే?

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తల్లి బాటలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందాలని భావిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. బాలీవుడ్‌లో నటిస్తూనే తన తల్లి కోరిక మేరకు టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరలో హీరోయిన్‌గా నటించి.. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానాల కాంబోలో తెరకెక్కుతోన్న పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది? పెద్దితో జాన్వీ మరో హిట్ అందుకుంటారా? అంటూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

పెద్ది ఫస్ట్ గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్
విలేజ్‌లో స్ట్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గింప్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. చివరిలో రామ్ చరణ్ క్రికెట్ గ్రౌండ్‌లో చేసే విన్యాసాలు పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకుంటున్నాయి. పలువురు ఈ షాట్‌ని రీల్‌గా చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి మురిసిపోతున్నారు. ఉప్పెన తర్వాత చరణ్‌తో సినిమా తీయాలని నిర్ణయించుకున్న బుచ్చిబాబు.. కథపై ఫోకస్ పెట్టి కట్టుదిట్టంగా సినిమాను ప్లాన్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు బుచ్చిబాబు.

Peddi Janhvi Kapoor remuneration sees substantial increase for Ram charan s Film

శరవేగంగా షూటింగ్
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్టింగ్ వేసి పెద్ది సినిమాను షూట్ చేయగా.. నెక్ట్స్ షెడ్యూల్‌ను ఢిల్లీలో ప్లాన్ చేశాడట బుచ్చిబాబు. ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్‌లో జాన్వీ కపూర్ జాయిన్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఆమెపై కీలక సన్నివేశాలతో పాటు రొమాంటింగ్ సీన్స్, రెండు పాటలను కూడా షూట్ చేయున్నారట. ఇంకా దాదాపు 50 శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను బుచ్చిబాబు ఇంత వేగంగా పూర్తి చేయడంపై సినీ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నాటికి షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై ఎక్కువ ఫోకస్ చేయాలని బుచ్చిబాబు భావిస్తున్నారట.

మార్చిన 27న పెద్ది రిలీజ్
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో పెద్ది సినిమాను నిర్మిస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. దివ్యేందు శర్మ, జగపతిబాబులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. పెద్ది సెట్స్ మీద ఉండగానే ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్‌లో బిజినెస్ జరుగుతోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.

జాన్వీ కపూర్‌కు భారీ రెమ్యునరేషన్
ఇకపోతే.. పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌కు రికార్డ్ రెమ్యునరేషన్ దక్కినట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ ఆఫర్లు లేనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆమెకు అంతగా హిట్స్ పడనప్పటికీ రెమ్యునరేషన్ మాత్రం భారీగా పెంచేస్తోందట జాన్వీ. ఎన్టీఆర్‌తో చేసిన దేవరకు 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న జాన్వీకపూర్ తన పారితోషికాన్ని మరో కోటి రూపాయలు పెంచారట. దీనిని బట్టి పెద్దికి ఆమె 6 కోట్ల రూపాయలు చార్జ్ చేసినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ జాన్వీ డిమాండ్‌ను చూసి పరిశ్రమ వర్గాలు షాక్‌కు గురవుతున్నాయి.

More from Filmibeat

Read more about: peddi janhvi kapoor ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X