పెద్దితో జాన్వీ లెవెల్ మారింది.. రెమ్యునరేషన్ వింటే షాక్ అవ్వాల్సిందే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'పెద్ది'(Peddi). ఈ మూవీ విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు సొంతం చేసుకుంటోంది. తాజాగా విడుదలైన టాప్ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటుంది. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఈ 'పెద్ది' మూవీ బడ్జెట్‌తో పాటు నటినటుల రెమ్యునరేషన్‌లపై ఆసక్తికర చర్చలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

రామ్ చరణ్ - బుచ్చి బాబు కాంబోలో తెరకెక్కిన పెద్ది మూవీ దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాను బుచ్చి బాబు సన తెరకెక్కిస్తున్నారు. 'ఉప్పెన' తర్వాత బుచ్చిబాబు చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌తో పాటు, పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందించిన నిర్మాణం వల్ల ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ స్టార్ క్యాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం.

Peddi Movie Janhvi Kapoor Remuneration Shocks Fans Ram Charan Leads Big Budget Craze

ఈ సినిమా నుంచి వెలువడుతున్న సమాచారం ప్రకారం.. హీరో రామ్ చరణ్ ఈ సినిమాకు దాదాపు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికంగా చెబుతున్నారు. గతంలో RRR, 'గేమ్ చేంజర్' వంటి సినిమాలకు ఆయన రూ.50 కోట్ల వరకు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే 'పెద్ది' కోసం ఆయన రేంజ్ డబుల్ కావడం.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్ కూడా భారీ పారితోషికం అందుకుంది. సుమారు రూ.6 కోట్ల వరకు ఆమె రెమ్యునరేషన్ తీసుకుందని టాక్. 'దేవర' తర్వాత మరోసారి సౌత్‌లో క్రేజీ ప్రాజెక్ట్ దక్కించుకున్న జాన్వీకి 'పెద్ది' పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ విశ్లేషకులు. ఈ సినిమా ద్వారా ఆమె మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఇక బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. 'మిర్జాపూర్' ఫేమ్ దివ్యంగా ఈ సినిమాలో నటించినందుకు దాదాపు రూ.7 కోట్ల పారితోషికం అందినట్టు సమాచారం. ఆయన పాత్ర కథలో కీలకంగా ఉంటుందని టాక్. ఇక సీనియర్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు సుమారు రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు. అలాగే కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయనకు దాదాపు రూ.10 కోట్ల వరకు పారితోషికం అందినట్టు సమాచారం.

ఇక సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బుచ్చిబాబు సానా కూడా భారీగా పారితోషికం అందుకున్నారని సమాచారం. దాదాపు రూ.30 కోట్ల వరకు ఆయన రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఆయన కెరీర్‌లోనే పెద్ద మొత్తంగా చెప్పుకోవచ్చు. రెహమాన్ భారీ ఫీజు తీసుకున్నారని టాక్. ట్రైలర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కే ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో, రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్‌గా మారనుంది.

'పెద్ది' సినిమా కేవలం కథ, కంటెంట్ పరంగానే కాకుండా, స్టార్ పవర్, టెక్నికల్ టీమ్, భారీ రెమ్యునరేషన్‌లతో కూడా ఒక గ్రాండ్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్, ఓవర్సీస్ ప్రీ-సేల్స్ హడావిడి చూస్తుంటే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'పెద్ది' సినిమా, రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందా? జాన్వీ కపూర్‌కు నిజంగా లెవెల్ పెంచే సినిమా అవుతుందా? అన్న ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X