మృణాల్ థాకూర్‌పై మరో క్రేజీ రూమర్.. ఏకంగా మెగా హీరోతోనే అంటూ!

Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పెద్ది ( Peddi). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామా జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

ఇప్పటికే విడుదలైన పెద్ది గ్లింప్స్‌లో రామ్ చరణ్ లుక్, విజువల్స్, డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రస్టిక్ టోన్‌లో చరణ్ కనిపించిన తీరు, బుచ్చిబాబు నెరేటివ్ స్టైల్‌పై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Peddi Movie Update Mrunal Thakur in Talks for Special Song in Ram Charan-Buchi Babu Pan-India Film

ఈ ఐటెం సాంగ్ విషయంలో మొదటగా పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట కాజల్ అగర్వాల్ పేరు వినిపించగా, ఆ తర్వాత 'పుష్ప'లో కిసిక్ పాటతో యువతను ఊపేసిన శ్రీలీల దాదాపు ఖాయమన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత 'బుట్టబొమ్మ'గా పాపులర్ అయిన పూజా హెగ్దేతో ఈ పాట చేయించాలని మేకర్స్ ఆలోచించినట్లు టాక్. గతంలో 'జిగేల్ రాణి' ఐటెం సాంగ్‌లో పూజా హెగ్దే సాధించిన సక్సెస్‌ను మళ్లీ రిపీట్ చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా నటి మృణాల్ ఠాకూర్ పేరు బలంగా వినిపిస్తోంది. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మృణాల్, ఇప్పుడు పెద్ది సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో కనిపించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పాటు, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో సినిమా కావడంతో మృణాల్ వెంటనే అంగీకరించినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఈ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ రూమర్ నిజమైతే మెగా ఫ్యాన్స్‌కు పండుగే అంటున్నారు.

ఈ ఐటెం సాంగ్ ని భారీ హంగులతో, అద్భుతమైన సెట్‌లో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, ఈ పాట కోసం ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే ఓ హుషారైన ట్యూన్ రెడీ చేశారనే ప్రచారం సినిమాపై హైప్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇటీవల కాలంలో అగ్ర కథానాయికలు ఐటెం సాంగ్స్‌లో నటించడం ట్రెండ్‌గా మారింది. తక్కువ కాల్షీట్స్‌లో భారీ పారితోషికం, భారీ రీచ్ లభిస్తుండటంతో స్టార్ హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్ పై ఆసక్తి చూపుతున్నారు.

దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రెజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. అన్ని షెడ్యూల్ ప్రకారం జరిగితే.. పెద్ది సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదల కానుంది. ఒకవైపు స్పోర్ట్స్ డ్రామా కథ, మరోవైపు పాన్ ఇండియా క్యాస్టింగ్, ఇక ఇప్పుడు ఐటెం సాంగ్‌పై నడుస్తున్న చర్చలు... ఇవన్నీ కలిపి పెద్ది సినిమాను రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ మైలురాయిగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Read more about: mrunal thakur peddi ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X