పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా నందమూరి హీరో? బుచ్చిబాబు నెక్ట్స్ లెవల్ ప్లానింగ్!
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మూవీ పెద్ది. జూన్ 4న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. 2026లో టాలీవుడ్‌లోనే మోస్ట్ అవైటెడ్ మూవీగా నిలిచిన పెద్ది కోసం అభిమానులు, సినీ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. గేమ్ ఛేంజర్‌తో అభిమానులను నిరాశ పరిచిన రామ్ చరణ్ ఈసారి భారీ హిట్‌పై కన్నేశారు. స్పోర్ట్స్, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన పెద్ది సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
పెద్దిలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు పెద్ది మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి.

రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా మే 18వ తేదీన పెద్ది ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత దేశంలోని పలు నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తోంది యూనిట్. ఇక బుచ్చిబాబు, రామ్ చరణ్‌లు కారులో లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి చేసిన ఇంటర్వ్యూ కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దేశంలోని ప్రాంతాల్లో ఈవెంట్స్‌ని కవర్ చేసిన తర్వాత జూన్ 2న హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అయితే ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరు? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌లలో ఒకరు పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరవుతారని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జూన్ 2న జరిగే పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారన్నది ఆ వార్త. దాంతో మరోసారి మెగా- నందమూరి కలయిక గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణతో రామ్ చరణ్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. తన తండ్రి చిరంజీవి మాదిరిగానే బాలయ్యను కూడా ఎంతో గౌరవిస్తారు రామ్ చరణ్. ఈ అభిమానంతోనే బాలయ్య హోస్ట్‌గా ఆహాలో వచ్చిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు హాజరై మెగా- నందమూరి కుటుంబాలు ఎంత సన్నిహితంగా ఉంటాయో అభిమానులకు తెలియజేశారు. అలాగే బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా చెర్రీ హాజరయ్యారు.
బయట ఎక్కడ కనిపించినా బాలయ్యను అప్యాయంగా పలకరిస్తారు చెర్రీ. అలాంటిది చరణ్ సినిమా ఈవెంట్ కోసం బాలకృష్ణ రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. దీనికి తోడు పెద్దికి నిర్మాతగా వ్యవహరిస్తున్న వెంకట సతీష్ కిలారు.. బాలయ్య - గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతోన్న ఎన్‌బీకే 111 సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణను పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా రావాలని నిర్మాత కోరినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ రామ్ చరణ్ ఈవెంట్‌లో బాలయ్య కనిపిస్తే మాత్రం మెగా- నందమూరి ఫ్యాన్స్‌కి పండగే.


Click it and Unblock the Notifications



