Peddi: ‘పెద్ది' లో బిగ్ సర్‌ప్రైజ్.. ఒకేసారి నలుగురు హీరోయిన్స్ తో రామ్ చరణ్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)హీరోగా తెరకెక్కుతున్న భారీ మూవీ 'పెద్ది'. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు బుచ్చి బాబు సనా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తి రగ్డ్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'చికిరి చికిరి', 'రై 'రై రా రా'పాటలు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ అందుకున్నాయి.

Also Read
పిల్లల్ని కనాలని ఉంది.. రెండో పెళ్లిపై నిహారిక కొణిదెల క్లారిటీ
పిల్లల్ని కనాలని ఉంది.. రెండో పెళ్లిపై నిహారిక కొణిదెల క్లారిటీ

స్పెషల్ సాంగ్‌తో మెగా సర్‌ప్రైజ్
తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాలో ఒక భారీ హై ఎనర్జీ స్పెషల్ సాంగ్ ఉండబోతుందట. ఆ పాటలో కేవలం ఒక హీరోయిన్ మాత్రమే కాకుండా మూడు నుంచి నాలుగు హీరోయిన్స్ కలిసి కనిపిస్తే బాగుంటుందని దర్శకుడు బుచ్చిబాబు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ సినిమాకు పెద్ద విజువల్ ట్రీట్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మాస్ బీట్‌తో ఉండే ఈ పాటలో రామ్ చరణ్‌తో కలిసి పలువురు స్టార్ హీరోయిన్స్ స్టెప్పులు వేయబోతున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Peddi Ram Charan to Dance with 3-4 Heroines in a Special Song Bucchi Babu s Big Plan

ఎవరెవరు ఈ సాంగ్‌లో?
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ పక్కా మాస్ మసాలా సాంగ్ ఉండనుందని సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అందులో ముఖ్యంగా పూజ హెగ్డే, స‌మంత‌, పూజా హెగ్డే, మృణాల్ ఠాకుర్, దిశా పఠానీ వంటి బ్యూటీల పేర్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో 'పుష్ప'లో ఐటమ్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో ఎవరు ఫైనల్ అవుతారన్నది వారి షెడ్యూల్స్‌పై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

Recommended For You
ఇంతకీ ఆమె ఎవరు ? బిగ్‌బాస్ మాధురి‌పై పెద్ది హీరోయిన్ ఫైర్!
ఇంతకీ ఆమె ఎవరు ? బిగ్‌బాస్ మాధురి‌పై పెద్ది హీరోయిన్ ఫైర్!

ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 30న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. సమాచారం ప్రకారం ఏప్రిల్ 10 నాటికి షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను కూడా త్వరగా పూర్తి చేయాల్సి ఉండటంతో అందుబాటులో ఉన్న హీరోయిన్స్‌తోనే ఫైనల్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

You May Also Like
'జబర్దస్త్ ఆఫర్‌ను అందుకే రిజెక్ట్ చేశా.. అనసూయ స్థానంలో హోస్ట్‌గా అవకాశాన్ని వదిలేశా!’
'జబర్దస్త్ ఆఫర్‌ను అందుకే రిజెక్ట్ చేశా.. అనసూయ స్థానంలో హోస్ట్‌గా అవకాశాన్ని వదిలేశా!’

రామ్ చరణ్ గత సినిమా'ఆర్ఆర్ఆర్' ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించిన తర్వాత వచ్చిన 'గేమ్ చేంజర్' సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు 'పెద్ది' సినిమాపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో నిజంగా ముగ్గురు లేదా నలుగురు హీరోయిన్స్ కనిపిస్తే అది అభిమానులకు భారీ ట్రీట్‌గా మారడం ఖాయం.ఇప్పుడు అందరి దృష్టి ఈ స్పెషల్ సాంగ్‌లో చివరకు ఎవరెవరు కనిపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Read more about: ram charan peddi bucchi babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X