Peddi vs Ustaad Bhagat Singh: ఇదెక్కడి ట్విస్ట్.. పెద్ది రిలీజ్ డేట్‌పై ఉస్తాద్ కన్ను!
Peddi vs Ustaad Bhagat Singh: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ అంశం చర్చనీయంగా మారింది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పెద్ది (Peddi)విడుదల వ్యవహారం. టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'పెద్ది' ఒకటి. మెగా అభిమానులే కాదు, సినీ ప్రేక్షకులందరి దృష్టి ఈ సినిమాపైనే నిలిచింది. 'ఉప్పెన' లాంటి సూపర్ హిట్ తర్వాత దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కావడంతో అంచనాలు మొదటి నుంచే భారీగా ఏర్పడ్డాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీలోనే ప్రత్యేకమైన బజ్ నెలకొంది.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'చికిరి చికిరి' సాంగ్ అయితే విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారి పెను సంచలనాన్ని సృష్టించింది. ఆ పాటతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక రామ్ చరణ్ కెరీర్‌లో మరో డిఫరెంట్ పాత్రగా తెరకెక్కుతున్న 'పెద్ది' ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సినిమాను మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రకటించినప్పటికీ, తాజా పరిస్థితులు చూస్తే ఆ డేట్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగిందంటే.. పెద్ది షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సరిపడా సమయం లేకపోవడం, అలాగే తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల టికెట్ రేట్ల నిబంధనల నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే.. ఇంకా దాదాపు నెలరోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఫస్ట్ హాఫ్ ఆర్ ఆర్ పూర్తయినా, మిగిలిన కీలక సన్నివేశాలు, ఐటెం సాంగ్ షూటింగ్, భారీ స్థాయి పాన్ ఇండియా ప్రమోషన్లు ఇంకా చేయాల్సి ఉంది. వీటన్నింటినీ నిర్ణీత సమయంలో పూర్తి చేయడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో పెద్ది సినిమాను మార్చి చివరి డేట్‌కు రావడం కంటే, పీక్ సమ్మర్ అయిన మే లేదా జూన్‌లో విడుదల చేస్తే బెటర్ అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు టాక్. అయితే దర్శకుడు బుచ్చిబాబు మాత్రం చరణ్ పుట్టినరోజు కానుకగా మార్చిలోనే సినిమాను ఇవ్వాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రీ-రికార్డింగ్ పనులు కూడా ప్రారంభించడంతో, చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా, 'పెద్ది' వాయిదా పడితే అదే డేట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మొదట ఏప్రిల్‌లో రిలీజ్ అనుకున్నప్పటికీ, ఇప్పుడు మార్చిలోనే థియేటర్లలోకి తీసుకురావచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.
'ఓజి' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడం, గబ్బర్ సింగ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించడం, ఫిబ్రవరిలో పెద్ద సినిమాలు లేకపోవడం వంటి అంశాలు 'ఉస్తాద్ భగత్ సింగ్'కు కలిసొచ్చే ప్లస్ పాయింట్లుగా మారాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఇలా ఈ అంశం చర్చనీయంగా మారింది. 'పెద్ది' మార్చి 27 డేట్ మిస్ అయితే అదే స్లాట్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇది కేవలం ఇండస్ట్రీ టాక్ మాత్రమే. రెండు చిత్రాల మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో రిలీజ్ పై స్పష్టత వచ్చే అవకాశముంది.


Click it and Unblock the Notifications











