Peddi Item Song: పెద్ది నుంచి సంయుక్త ఔట్? రామ్‌చరణ్‌తో ఆ హీరోయిన్ మాస్ స్టెప్పులు?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ స్టార్ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ పెద్ది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా విషయంలో అన్నీ అవాంతరాలు ఎదురవుతున్నాయి. సినిమా విడుదల ఆగిపోగా.. ఇప్పుడు ఈ మూవీలోని ఐటెం సాంగ్ గందరగోళంగా మారింది. ఈ సాంగ్ చేసేది ఎవరనే దానిపై రోజుకొక హీరోయిన్ పేరు తెరపైకి వస్తుండటంతో అభిమానులు కంగారుపడుతున్నారు. తాజాగా ఈ ఇష్యూకి సంబంధించి మరో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, దివ్యెందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. వృద్ది సినిమాస్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై కిలారు వెంకట సతీష్, ఇషాన్ సక్సేనాలు పెద్ది సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేత, మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా, నవీన్ నూలీ ఎడిటర్‌గా సేవలందిస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌లు సమర్పిస్తున్నాయి. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

తొలుత ఏప్రిల్ 30న పెద్ది సినిమా విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. అయితే షూటింగ్ పూర్తి కాకపోవడం, తదితర కారణాలతో ఈ మూవీ రిలీజ్ జూన్ నెలకు వాయిదా పడింది. ఈ సినిమా వాయిదా పడటానికి ప్రధాన కారణం.. ఈ చిత్రంలోని ఐటెం సాంగ్ మాత్రమే కారణమన్నది బహిరంగ రహస్యం. ఇదంతా ఒక ఎత్తయితే అసలు ఈ ఐటెం సాంగ్ ఎవరు చేస్తారన్నది ఇంకా సస్పెన్స్‌గా మారింది.
పెద్దిలో తొలుత తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ చేయబోతన్నారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ప్లేస్‌లోకి మృణాల్ ఠాకూర్ వచ్చిందన్నారు. డెకాయిట్ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న మృణాల్‌ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. తాను పెద్దిలో నటించడం లేదని తేల్చిచెప్పారు. దాంతో కొద్దిరోజులు ఈ విషయం సద్దుమణగగా.. అనూహ్యంగా ఈ ప్లేస్‌లోకి సంయుక్త మీనన్ వచ్చింది. అంతేకాదు.. ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతుందో కూడా చెబుతూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.
రేపోమాపో రాం చరణ్‌తో కలిసి సంయుక్త మీనన్ ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్‌లో పాల్గొంటోందని ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు సంయుక్త మీనన్ ప్లేస్‌లోకి శృతి హాసన్ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ గతంలో ఎవడు సినిమాలో జంటగా నటించారు. చాలాకాలం తర్వాత ఈ జంట మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో శృతి హాసన్ గతంలో పలు సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసిన అనుభవం ఉంది. ఆగడు, హాయ్ నాన్న సినిమాలలో ఆమె మాస్ సాంగ్స్ చేశారు. అలవాటైన పని, దానికి తోడు భారీ రెమ్యునరేషన్ నేపథ్యంలో శృతిహాసన్ ఖచ్చితంగా పెద్ది మూవీ ఆఫర్‌కు అంగీకరిస్తారని ఫిలింనగర్ టాక్. మరి శృతిహాసన్ అయినా ఈ సాంగ్ చేస్తారా? లేక మరో హీరోయిన్ ఈ ప్లేస్‌లోకి వస్తుందా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications


