Peddi Special Song: ‘అఖండ' బ్యూటీకి బంపర్ ఆఫర్.. రామ్ చరణ్‌తో మాస్ స్పెప్పులు!

Peddi Special Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా 'పెద్ది' పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందించిన ఈ సినిమా ఇప్పటికే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఉండబోయే స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేస్తే హీరోయిన్ ఎవరు అన్నది.

రామ్ చరణ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. గతంలో రంగస్థలంలో పూజా హెగ్డే చేసిన "జిల్ జిల్ జిగేలు రాణి" పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అందుకే 'పెద్ది' సినిమాలో కూడా స్పెషల్ సాంగ్‌పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మొదట ఈ పాటలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారనే వార్తలు వచ్చాయి. ఒకే ఫ్రేమ్‌లో స్టార్ హీరోయిన్లు, రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తే థియేటర్లలో పూనకాలు ఖాయమని అభిమానులు చర్చించుకున్నారు.

Peddi Special Song Samyuktha Menon to Dance With Ram Charan in Mass Number Buzz

ఆ తర్వాత ఈ స్పెషల్ సాంగ్ కోసం పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ పేరు వినిపించగా, తర్వాత మానస వారణాసి (Manasa Varanasi)పేరు కూడా బలంగా వినిపించింది. 'కపుల్ ఫ్రెండ్లీ'తో గుర్తింపు తెచ్చుకున్న మానసకు ఈ అవకాశం దక్కిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో మరింత కన్ఫ్యూజన్ నెలకొంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ గందరగోళానికి ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. 'పెద్ది' స్పెషల్ సాంగ్‌లో రామ్ చరణ్ సరసన యంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కనిపించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ల అఖండ 2: తాండవం( Akhanda 2: Tandavam)లో "జాజికాయ జాజికాయ" పాటతో మాస్ స్టెప్పులు వేసిన సంయుక్తకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే ఎనర్జీతో రామ్ చరణ్‌తో కలిసి స్టేజ్ షేక్ చేయనుందన్న టాక్ వినిపిస్తోంది.

సంయుక్త ఇప్పటికే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌లోనూ మంచి టాలెంట్ చూపించిన ఆమెకు ఈ స్పెషల్ సాంగ్ మంచి ప్లస్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. రామ్ చరణ్ ఎనర్జీ, సంయుక్త స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే ఈ పాట సినిమా హైలైట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే, రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా A. R. రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన రావడంతో ఆల్బమ్‌పై అంచనాలు పెరిగాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో, క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త మాస్ లుక్‌లో కనిపించనున్నారు. గుబురు గడ్డం, రఫ్ బాడీ లాంగ్వేజ్‌తో విడుదలైన పోస్టర్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి.

ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉండగా, స్పెషల్ సాంగ్ షూట్ త్వరలోనే ప్రారంభం కాబోతుందటని టాక్. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ కావాల్సిన సమాచారం. 'పెద్ది'ని ఏప్రిల్ నెలాఖరున థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరం అవుతుందని జూన్ నెలకు వాయిదా వేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... జూన్ 4వ తేదీన విడుదల చేయడానికి ప్లాన్ చేశారట. ఇలా 'పెద్ది' సినిమా ప్రతి చిన్న అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు అందరి చూపు ఒక్కటే.. రామ్ చరణ్‌తో కలిసి ఆ మాస్ స్పెషల్ సాంగ్‌లో చివరకు ఎవరు కనిపిస్తారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X