NTR31: ఎన్టీఆర్ - బుచ్చిబాబు సినిమాకు ఊహించని టైటిల్.. ఆరోజే ప్రకటనతో పాటు పోస్టర్ కూడా!
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్, పాటలు ఇలా అన్నింట్లోనూ రాణిస్తూ సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. రూపంలో తాతకు తగ్గ మనవడిగా పేరొందిన అతడు.. తనదైన శైలి నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
Recommended Video
ఇక, ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ యమ జోష్‌లో ఉన్న తారక్.. వరుసగా సినిమాల మీద సినిమాలను లైన్‌లో పెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే అతడు బుచ్చిబాబు సనతో ఓ మూవీ చేయబోతున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన టైటిల్ బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

ఏకంగా ఐదు హిట్లతో ఫుల్ ఫామ్
ఆ మధ్య వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డ జూనియర్ ఎన్టీఆర్.. 'టెంపర్' మూవీతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వరుసగా 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి హిట్లను సొంతం చేసుకున్నాడు. అలాగే, మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

పాన్ వరల్డ్ సినిమాలోనూ భాగం
హిట్లు మీద హిట్లు కొడుతూ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తోన్న RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో తారక్.. కొమరం భీంగా, చరణ్.. అల్లూరి పాత్రలను పోషిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా హీరోయిన్లుగా చేస్తున్నారు.

త్రివిక్రమ్ అవుట్.. కొరటాల ఇన్
RRR పట్టాలపై ఉండగానే తారక్ తన 30వ సినిమాను త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఇది మాత్రం ప్రారంభం కాలేదు. ఆ తర్వాత ఎన్నో మలుపుల తర్వాత ఈ సినిమాను ఆపేసినట్లు ప్రకటించారు. అనంతరం 30వ ప్రాజెక్టును కొరటాల శివతో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి.

నీల్‌తో సినిమా.. అది వాయిదానే
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈ స్టార్ హీరో ఇప్పటికే కొరటాల శివతో సినిమాను ప్రకటించాడు. దీని తర్వాత అతడు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని గత ఏడాదే అధికారికంగా ప్రకటించారు. అయితే, ఇది ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని టాక్.

ఉప్పెన దర్శకుడితోనూ సినిమా
RRR మూవీతో పాటు కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో సినిమాలు ప్రకటించిన ఎన్టీఆర్.. ఈ క్రమంలోనే 'ఉప్పెన' ద్వారా మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆ డైరెక్టర్ స్పోర్ట్స్ బేస్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.

ఈ సినిమాకు ఊహించని టైటిల్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సన తెరకెక్కించబోతున్న సినిమా 1960 దశకం నాటి కథతో రూపొందనుందని అంటున్నారు. ఇందులో హీరో పాత్ర కబడ్డీ ప్లేయర్‌గా ఉంటుందని కొందరు, ఖోఖో కోచ్‌గా కనిపిస్తుందని మరికొందరు అంటున్నారు. ఈ విషయంలో క్లారిటీ లేకపోయినా.. ఈ సినిమాకు మాత్రం 'పెద్ది' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

ఆరోజే టైటిల్‌ను అనౌన్స్ చేస్తారు
పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందట. ఆరోజు 'పెద్ది' అనే టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేయబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర పేరు ఇదేనని కూడా తెలుస్తోంది. అన్ని భాషల్లోనూ ఒక్కటే టైటిల్ ఉండేలా దీన్ని ఫిక్స్ చేశారట. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ అని సమాచారం.


Click it and Unblock the Notifications











