మెగా హీరోను సమంత పిచ్చోన్ని చేసిందంటూ... ప్రచారం!
సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘విన్నర్’ చిత్రానికి సంబంధించిన ఓ సాంగును సమంత ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు.
హైదరాబాద్: సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య కామెంట్ల వార్ జరుగుతుండటం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయింది. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సాయి ధరమ్ తేజ్ విషయంలో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది.
ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే... మెగా హీరోను హీరోయిన్ సమంత పిచ్చోన్ని చేసిందట. త్వరలో అక్కినేని అబ్బాయిని పెళ్లాడబోతున్న సమంతపై ఇలాంటి రూమర్ ప్రచారంలోకి రావడానికి కారణం ఏమిటా అని ఆరా తీస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న 'విన్నర్' చిత్రానికి సంబంధించిన ఓ సాంగును సమంత ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. ఆ సాంగ్ పేరు 'పిచ్చోన్నే అయిపోయా'.... అయితే కొందరు దీన్ని ఇలా నెగెటివ్ గా ప్రచారం చేసారు.
విన్నర్ సినిమా విషయానికొస్తే... సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపీచద్ మినేని దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు కలిసి లక్ష్మినరసింహ ప్రొడక్షన్ బేనర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











