twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధన్ రాజ్ నోరు జారాడా..ఓపినెంగ్ రోజే తీసేసారా?

    By Srikanya
    |

    హైదరాబాద్ : నిన్నటి నుంచి తెలుగు సినీ వర్గాల్లో ఓ టాపిక్ రన్ అవుతోంది. అది మరేదో కాదు...కమిడియన్ థన్ రోజు నోరు జారటం వల్ల ..తొలిరేజే ప్రాజెక్టు నుంచి తీసేసారని. ఇది ఎంతవరకూ నిజమో కానీ మీడియా వర్గాల్లోనూ చర్చగా మారింది. ఇంతకీ ఏ సినిమా నుంచీ అంటే మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించనున్న పిలవని పేరంటం చిత్రంలోనుంచి అని తెలుస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ గా నడిచే ఈ హర్రర్ కామెడీలో మంచు లక్ష్మి కీలక పాత్ర పోషిస్తోంది. ధన్ రాజు ని మరో ప్రధాన పాత్రకు తీసుకున్నారు.

    అయితే ధన్ రాజు అత్యుత్సాహంతో తను హీరోగా నటిస్తున్న చిత్రం అని చెప్పటంతో మంచు లక్ష్మి సీరియస్ అయ్యిందని అంటున్నారు. దానికి తోడు మీడియాలో ఎక్కడ చూసినా మంచు లక్ష్మి కి జోడిగా ధన్ రాజు అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో అతన్ని సాగనంపారని చెప్పుకుంటున్నారు. అయితే దీంట్లో ఎంత నిజముందో ఆ యూనిట్ వర్గాలే చెప్పాలి.

     Pilavani Perantam: Dhanraj OUT on the Opening Day?

    లక్ష్మీ మంచు ప్రధాన పాత్రధారిగా ‘పిలవని పేరంటం' అనే చిత్రం షూటింగ్‌ మంగళవారం రామానాయుడు స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ధనరాజ్‌, శియా గౌతమ్‌ (‘నేనింతే' ఫేమ్‌) మరో రెండు కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రియదర్శిని మూవీ మేకర్స్‌ పతాకంపై నాలి సుబ్బారావు నిర్మిస్తున్నారు. వెంకన్నబాబు యేపుగంటి దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి కె. రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, మంచు మనోజ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

    నిర్మాత సుబ్బారావు మాట్లాడుతూ.... ప్రధాన పాత్రను చేయడానికి లక్ష్మి అంగీకరించడం సంతోషంగా ఉందనీ, డిసెంబర్‌ 1 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుతామనీ అన్నారు. ఈ సినిమాలో నవ్విస్తూ భయపెడతామనీ, భయపెడుతూ నవ్విస్తామనీ ధనరాజ్‌ చెప్పారు.

    లక్ష్మీ మంచు మాట్లాడుతూ ‘‘నాకు కథలు తొందరగా నచ్చవు. అలాంటిది ఈ కథ బాగా నచ్చింది. చాలా ఆసక్తికరంగా నడిచే కథ. నా పాత్ర చాలా బాగుంది. నన్ను నమ్మి ఇంత పెద్ద పాత్ర ఇచ్చినందుకు హ్యాపీ'' అన్నారు.

    ఇది థ్రిల్లింగ్‌ స్ర్కిప్ట్‌ అని శియా గౌతమ్‌ చెప్పారు. ‘గీతాంజలి', ‘బూచమ్మ బూచోడు' తరహాలో ఓ కొత్త కథతో ఈ సినిమా చేస్తున్నామనీ, నాలుగు పాటలుంటాయనీ దర్శకుడు వెంకన్నబాబు తెలిపారు. ఓ పేరున్న హీరో ఇందులో విలన్‌గా చేయబోతున్నారని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఖాదర్‌ ఘోరి చెప్పారు.

    కేష, కృష్ణుడు, పృథ్వీరాజ్‌, రఘు కారుమంచి ఇప్పటి వరకూ ఎంపికైన తారాగణం. వెంకటేశ్‌ కిలారి మాటలు రాస్తున్న ఈ చిత్రానికి రచనా సహకారం: అరుణ్‌కుమార్‌ నిమిషకవి, అడిషనల్‌ స్ర్కీన్‌ప్లే, కథా సహకారం: మధు విప్పర్తి, సంగీతం: విజయ్‌ కురాకుల, ఛాయాగ్రహణం: జి.ఎల్‌. బాబు, కూర్పు: ఉపేంద్ర, కళ: కుమార్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: ఖాదర్‌ ఘోరి, దేవర శ్రీకాంత్‌రెడ్డి, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: వెంకన్నబాబు యేపుగంటి.

    English summary
    Comedian Dhanraj no more a part of Pilavani Perantam film. Pilavani Perantam is touted to be a heroine centric horror comedy with Lakshmi Manchu playing a crucial role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X