వైవియస్ చౌదరి కి టైం వచ్చింది
హైదరాబాద్ : 'పిల్లా నువ్వు లేని జీవితం' విజయం దర్శకుడు రవికుమార్ చౌదరి కెరీర్ కు ఏ స్ధాయిలో ఉయోగపడిందో కానీ వైవియస్ చౌదరి మాత్రం ఉత్సాహంగా ఉన్నాడంటున్నారు. ఈ చిత్రం విడుదలైన దగ్గరనుంచీ 'రేయ్ ' చిత్రం కు ఎంక్వైరీలు వస్తున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. ట్రైలర్ వదినప్పుడు రాని క్రేజ్ ఈ చిత్రం విడుదలైన తర్వాత వచ్చిందంటున్నారు. దాంతో వైవియస్ చౌదరి ఉత్సాహంగా ఉన్నాడని, అన్నీ అనుకూలిస్తే... డిసెంబర్ రెండవ వారంలో రేయ్ ని విడుదల చేసే అవకాసం ఉందంటున్నారు.
వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ 'ఇటీవలి కాలంలో యూత్‌ని టార్గెట్ చేస్తూ క్లాస్, ఫాస్ట్‌ఫుడ్ తరహా లవ్‌స్టోరీలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే 'దేవదాసు', 'దేశముదురు' తరహాలో భారీ స్థాయి మాస్, యూత్ లవ్‌స్టోరీలు రావడంలేదు. ఆ లోటుని తీర్చేవిధంగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే రీతిలో 'రేయ్' తయారవుతోంది. కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది.
ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశాం. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాతోనే సాయిధరమ్ తేజ్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడనే నమ్మకం ఉంది. అలాగే సయ్యామి ఖేర్ తన అందంతో యూత్‌ని ఆకట్టుకుంటుంది. శ్రద్ధాదాస్ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది. ఇక పాటలన్నీ సందర్భోచితంగా, నాదైన గ్రాండియర్ స్టయిల్‌లో ఆకట్టుకుంటాయి' అని తెలిపారు.

వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. ఈ ప్రీమియర్ షోల్లో చిత్రబృందమంతా పాల్గొంటుంది'' అని తెలిపారు. ఈ చిత్రాన్ని వెస్టిండీస్ లో విడుదల చేస్తున్నారు. అక్కడ ఇంతకు ముందు ఏ తెలుగు సినిమా విడుదల కాలేదు. ఈ విషయాన్ని వైవియస్ చౌదరి మీడియాకు తెలియచేసారు.
చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ కన్నా ఈ మేనల్లుడిలోనే చిరు పోలికలు బాగా ఉన్నాయి చిరంజీవి నట వారసత్వాన్ని పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోగల సత్తా సాయి ధరమ్ తేజకే ఉన్నాయనిపిస్తోందన్న వాదనలను కూడా తీసుకవస్తున్నారు. ఏదైనా మేనమామ పోలికలు వస్తే అదష్టవంతులవుతారంటారు. మరి తన మేనమామలా సాయి ధరమ్ తేజ కూడా స్టార్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే...
ఎవరేమన్నా మెగాస్టార్ మాత్రం తమ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమవుతున్న తమ బిడ్డల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానంటున్నారు. దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. చిత్రంలో అర్పిత్ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, నరేష్, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్.


Click it and Unblock the Notifications











