పవన్ పుట్టిన రోజున స్పెషల్ టీజర్

సాయిధరమ్‌తేజ్, రెజీనా జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'పిల్లా నువ్వులేని జీవితం'. ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్, దిల్‌రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. హర్షిత్, బన్నీవాసు నిర్మిస్తున్నారు.
దర్శకుడు రవికుమార్ చౌదరి మాట్లాడుతూ...''ఏం పిల్లో.. తరవాత కొంత విరామం తీసుకొన్నా. కాకపోతే చాలా కథలు రాసుకొన్నా. నేను బతకడానికైతే విరామం లేకుండా సినిమాలు చేసేవాడిని. కానీ నా స్నేహితులు మంచి కథతో సినిమా తీయమని సూచించారు. అందుకే ఈ ఆలస్యం. మొదటి దిల్ రాజు గారికి కథ చెప్పాను. ఆయన నచ్చి అరవింద్ గారి దగ్గరకి తీసుకు వెళ్లారు. ఆయనకు కూడా నచ్చి వెంటనే ఓకే అన్నారు. ఇద్దరు పెద్ద నిర్మాతలతో చేసే అవకాసం రావటం చాలా ఆనందంగా ఉంది అన్నారు. '' అన్నారు.
సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ... ఇది నా రెండో సినిమా ఈ సినిమాకు కళ్యాణ్ మామయ్య నటించిన గబ్బర్ సింగ్ లో విజయవంతం అయిన పిల్లా నువ్వు లేని జీవితం అనే పాట పల్లవిని టైటిల్ గా పెట్టడం సంతోషంగా ఉంది. ఇంత మంచి టీమ్ తో పనిచేయడం ఆనందంగా ఉంది అన్నారు.
హీరో,హీరోయిన్స్ కాక ఈ సినిమాలోని ఇతర పాత్రల్లో జగపతిబాబు, ప్రకాష్ రాజ్, సత్యకృష్ణన్, చంద్రమోహన్, ధర్మవరపు, రఘుబాబు, దువ్వాసి మోహన్, రజిత, సత్యకృష్ణ, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలుః మరుధూరి రాజా, పాటలుః చంద్రబోస్, అశోక్ తేజ, సంగీతం అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫిః దాశరధిశివేంద్ర, కథ, మాటలు, దర్శకత్వం ఎ.ఎస్.రవికుమార్.


Click it and Unblock the Notifications











