`పిల్లా నువ్వు లేని జీవితం' ఆ సినిమా నుంచి ఎత్తారా?
హైదరాబాద్ : మరో మెగా హీరో సాయిధరమ్‌తేజ్ హీరోగా లాంచ్ అవుతూ చేసినచిత్రం `పిల్లా నువ్వు లేని జీవితం'. రెజీన హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్-శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌స సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్ని వాసు-శ్రీ హర్షిత్ నిర్మాతలు. ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకుడు. అనూప్ రూబెన్‌స సంగీతం అందించారు. ఈ చిత్రం రామ్ హీరోగా వచ్చిన మస్కా నుంచి స్టోరీ లైన్ తీసుకుని చేసినట్లు సమాచారం.
అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి ఓ పొలిటీషియన్. ఆయనకు అక్రమ సంతానం హీరోయిన్. ఈ విషయాన్ని బయిటపెట్టి ఎలక్షన్స్ లో లబ్ది పొందాలనుకుంటారు ప్రత్యర్దులు. అప్పుడు ఆమెను చంపేయమని పురమాయిస్తాడు ఆ తండ్రి. ఆ పని చేయటానికి జగపతిబాబు అనే రౌడీ ముందుకు వస్తాడు. ఆమెను చంపేసే సమయంలో హీరో సుడిగాలిలా వచ్చి రక్షిస్తాడు. ఇంతకీ హీరో ఎవరయ్యా అంటే..ఆమెను మనసారా ప్రేమించి...పిల్లా నువ్వు లేని జీవితం అని పాటలు పాడుకుంటున్న కుర్రాడు. తన లవర్ పై జరుగుతున్న ఎటాక్ ని ఆపు చేసి, అసలు నిజం బయిటపెట్టి ఆమె ప్రేమని పొంది, ఆమెను ఎలా సాధించుకున్నాడనేది కథ అని వినపడుతోంది.

ఇక ఈ చిత్రం 400 థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా నేడు రిలీజవుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నిర్మాతగా 50 సినిమాలు తెరకెక్కించా. నేను నిర్మించిన 50సినిమాలు ఒక ఎత్తు. పిల్లా నువ్వు లేని జీవితం ఇంకో ఎత్తు. పెద్ద విజయం సాధిస్తుంది అన్నా మెగా నిర్మాత అల్లు అరవింద్. ఈ సినిమా గొప్ప ఫీల్‌గుడ్ లవ్‌స్టోరి. సాయిధరమ్ తేజ్ హీరోనే కాదు స్టార్ మెటీరియల్ అని నిరూపించే సినిమా ఇది. తప్పక విజయం సాధిస్తామని ధీమాగా చెబుతున్నారాయన.
మరో నిర్మాత దిల్‌రాజు సైతం సాయిధరమ్‌పై పెద్ద రేంజులో ప్రశంసలు కురిపించారు. బన్నికి `ఆర్య'లా, నితిన్‌కి `దిల్'లా, చరణ్‌కి `మగధీర' లా సాయిధరమ్‌కి `పిల్లా నువ్వు లేని జీవితం' అంటూ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్ డ్యాన్సింగ్ స్టయిల్, ఎనర్జీ ఈ సినిమాకి పెద్ద అస్సెట్ అవుతాయని రెజీన చెబుతోంది. ఇద్దరు అభిరుచి ఉన్న నిర్మాతల కలయికలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











