నాని చివరకు...బ్యాక్ టు పెవిలియన్
హైదరాబాద్ : రాజమౌళి, గౌతమ్ మీనన్, సముద్ర ఖని వంటి పెద్ద డైరక్టర్స్ తో చేస్తున్నాం ఇక మన కెరీర్ కి ఢోకా లేదనుకున్నాడు నాని. అయితే పరిస్దితి తారు మారు అయ్యింది. రాజమౌళి ఈగ తప్ప ఏదీ హిట్ కాలేదు. మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఎంత డ్రాప్ అంటే ఆయన తాజా చిత్రం జెండాపై కపిరాజు బిజినెస్ కానంతగా ప్లాఫ్ లు చుట్టముట్టేసాయి. ఈ పరిస్ధితుల్లో నాని తిరిగి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు అశోక్ తో జతకట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పిల్ల జమీందారు చిత్రంలో ఈ కాంబినేషన్ హిట్టైంది. దాంతో వీళ్లిద్దరూ కలిసి పనిచేయనున్నారు. రెజీనా హీరోయిన్ గా చేసే ఈ చిత్రం జూన్ నుంచి మొదలు కానుంది. అశోక్ సైతం ...పిల్ల జమీందార్ తర్వాత వచ్చిన సుకుమారుడు చిత్రం డిజాస్టర్ అయ్యి ఇప్పటికి ఒక్క సినిమా కూడా మొదలపెట్టలేకపోయాడు. ఆ మధ్యన అనుష్క తో భాగమతి అన్నారు కానీ అదీ వర్కవుట్ కాలేదు. దాంతో అశోక్ సైతం నానితో ముందుకు వెళ్లటమే సరైన స్ట్రాటజీగా భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో చిత్రం మొదలయ్యే అవకాసం ఉంది.

మరో ప్కక్క నాని, తన స్నేహితుడు అవసరాల శ్రీనివాస్ కి డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. మొదటి సినిమా రిలీజ్ కాకముందే అతని ప్రతిభమీద నమ్మకంతో ఈ సినిమా కమిటయ్యాడంటున్నారు. అయితే అసలే ఫ్లాపుల్లో ఉన్న ఈ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవటం అవసరమా అని ఆయన్ని అభిమానించే ఇండస్ట్రీ వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు. దానికి తోడు నాని హీరోగా చేసిన జెండాపై కపిరాజు చిత్రం సైతం బిజినెస్ లేక మూలన పడి ఉన్న సమయంలో కాస్త క్రేజ్ వచ్చే ప్రాజెక్టుని ఎంచుకోక ఎందుకీ సాహసం అని చెప్తున్నారు.
అయితే అవసరాల శ్రీనివాస్ చేసిన చిత్రం కొంత భాగం చూసే..నాని ఈ ఆఫర్ ఇచ్చాడంటున్నారు. అష్టాచెమ్మతో పరిచయమైన హీరోలు అవసరాల శ్రీనివాస్, నాని. నాని హీరోగా దూసుకెళ్ళి పెద్ద డైరక్టర్స్ చేసేసాడు. అయితే పెద్ద అనేదే కలిసిరాక ఫ్లాఫ్ లతో చతికిల పడ్డాడు. ఈ సమయంలో అవసరరాల శ్రీనివాస్ కొన్ని చిత్రాల్లో కమిడియెన్ గా చేసినా, తన దృష్టిని పూర్తిగా దర్శకత్వం మీదే కాన్సర్టేట్ చేసారు. రీసెంట్ గా ఆయన దర్శకుడుగా మారి ఊహలు గుసగుసలాడే అనే చిత్రం రూపొందించారు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారని సమాచారం. అయితే నాని నిర్ణయం కరెక్టు అయ్యి వీరి కాంబినేషన్ పెద్ద హిట్ కావచ్చు.


Click it and Unblock the Notifications











