twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లేశం భార్యతో పవన్ కళ్యాణ్! రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

    |

    గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ హీరోయిన్ అంటూ తాజాగా బయటకొచ్చిన మరో వార్త మెగా అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించింది. ఆ వివరాలు చూద్దామా..

    సినిమాలు, రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తూ..

    సినిమాలు, రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తూ..

    'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయబాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపుతున్నారు. ఇకపై ఆయన సినిమాలు, రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లనున్నారని సమాచారం. ఈ మేరకు పవన్ హీరోగా పింక్ రీమేక్ మూవీ కన్ఫర్మ్ అయింది. 'పింక్' సినిమా రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే అని కన్ఫర్మ్ చేస్తూ ఇటీవలే ఓ హింట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.

    ప్రేక్షకుల దృష్టాంతా పవన్ భామపైనే..

    ప్రేక్షకుల దృష్టాంతా పవన్ భామపైనే..

    శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 40వ ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, MCA ఫేం శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక సినిమాలో పవన్ సరసన నటించనున్న హీరోయిన్ ఎవరు? ఆ వివరాలేంటి? అనే దానిపై ఓ లుక్కేసింది ప్రేక్షకలోకం.

    ముగ్గురు హీరోయిన్లు.. అందులో ఇద్దరు

    ముగ్గురు హీరోయిన్లు.. అందులో ఇద్దరు

    బాలీవుడ్‌లో సక్సెస్ సాధించిన 'పింక్' సినిమాకు రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ఇప్పటికే నివేద థామస్, అంజలి కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు రాగా, తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా బయటకొచ్చింది.

    మల్లేశం భార్యతో పవన్ కళ్యాణ్

    మల్లేశం భార్యతో పవన్ కళ్యాణ్

    పింక్ రీమేక్‌లో మూడో హీరోయిన్‌గా మల్లేశం సినిమా ఫేం అనన్య నాగళ్ళకు అవకాశం ఇచ్చారని లేటెస్ట్ సమాచారం. మల్లేశం సినిమాలో మల్లేశం భార్యగా ఆమె అభినయం చూసి ఫిదా అయిన దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ సరసన ఈమె అయితేనే సరికొత్తగా, సూపర్ జోడీగా ఉంటుందని అలా ఫిక్స్ చేశారట.

    త్వరలోనే పూర్తి వివరాలు.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా

    త్వరలోనే పూర్తి వివరాలు.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా

    ఇంకా పింక్ రీమేక్ చిత్రానికి సంబంధించి ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపి మెగా అభిమానులను ఖుషీ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. థమన్ బాణీలు కట్టబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ సమర్పిస్తుండటం విశేషం.

    English summary
    Power star Pawan Kalyan re entry confirmed. As per latest talk in this movie heroine Ananya Nagalla romance with Pawan Kalyan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X