Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మల్లేశం భార్యతో పవన్ కళ్యాణ్! రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
గత కొంతకాలంగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఆయన రీ ఎంట్రీ కన్ఫర్మ్ కావడంతో ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ హీరోయిన్ అంటూ తాజాగా బయటకొచ్చిన మరో వార్త మెగా అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తించింది. ఆ వివరాలు చూద్దామా..
సినిమాలు, రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తూ..
'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయబాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపుతున్నారు. ఇకపై ఆయన సినిమాలు, రాజకీయాలు రెండూ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లనున్నారని సమాచారం. ఈ మేరకు పవన్ హీరోగా పింక్ రీమేక్ మూవీ కన్ఫర్మ్ అయింది. 'పింక్' సినిమా రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయమే అని కన్ఫర్మ్ చేస్తూ ఇటీవలే ఓ హింట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
ప్రేక్షకుల దృష్టాంతా పవన్ భామపైనే..
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 40వ ప్రాజెక్టుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, MCA ఫేం శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్నారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక సినిమాలో పవన్ సరసన నటించనున్న హీరోయిన్ ఎవరు? ఆ వివరాలేంటి? అనే దానిపై ఓ లుక్కేసింది ప్రేక్షకలోకం.
ముగ్గురు హీరోయిన్లు.. అందులో ఇద్దరు
బాలీవుడ్లో సక్సెస్ సాధించిన 'పింక్' సినిమాకు రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ఇప్పటికే నివేద థామస్, అంజలి కన్ఫర్మ్ అయినట్లుగా వార్తలు రాగా, తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా బయటకొచ్చింది.
మల్లేశం భార్యతో పవన్ కళ్యాణ్
పింక్ రీమేక్‌లో మూడో హీరోయిన్గా మల్లేశం సినిమా ఫేం అనన్య నాగళ్ళకు అవకాశం ఇచ్చారని లేటెస్ట్ సమాచారం. మల్లేశం సినిమాలో మల్లేశం భార్యగా ఆమె అభినయం చూసి ఫిదా అయిన దిల్ రాజు.. పవన్ కళ్యాణ్ సరసన ఈమె అయితేనే సరికొత్తగా, సూపర్ జోడీగా ఉంటుందని అలా ఫిక్స్ చేశారట.
త్వరలోనే పూర్తి వివరాలు.. మెగా అభిమానులు ఖుషీ అయ్యేలా
ఇంకా పింక్ రీమేక్ చిత్రానికి సంబంధించి ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిపి మెగా అభిమానులను ఖుషీ చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. థమన్ బాణీలు కట్టబోతున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాత బోణీ కపూర్ సమర్పిస్తుండటం విశేషం.