అసిన్ నన్ను పెళ్లాడు.. లేదంటే చచ్చిపోతా...!?
అందాలతార అసిన్ బాలీవుడ్ లోకి ప్రవేశించిన తర్వాత ఆమెకు అభిమానులు ప్రపంచవ్యాప్తంలో ఏర్పడ్డారు. అసిన్ కు రోజూ పెద్ద సంఖ్యలో ఉత్తరాలు వచ్చిపడుతున్నాయట. వీటి సంగతి అలా ఉంచితే... గత కొన్ని రోజులుగా ఓ వీరాభిమాని అసిన్ ను పెళ్లి చేసుకోవాల్సిందిగా లేఖలపై లేఖలు రాస్తున్నాడట. అంతేకాదు... సదరు అభిమాని లక్షల రూపాయలు విలువ చేసే ఆభరణాలను ఆమెకు కానుకగా పంపించాడట. నగలతోపాటు ఓ ప్రేమలేక కూడా జతచేసి పంపాడట. ఆ ప్రేమ లేఖలో తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపు వాక్యాలు రాశాడట.
మరో విచిత్రం ఏంటంటే.. ఆ అభిమాని తల్లి ప్రతిరోజూ అసిన్ కు ఫోన్ చేసి, తన కుమారుడిని వివాహం చేసుకోవాలని అభ్యర్థిస్తోందట. ఉదయం లేచిన దగ్గర్నుంచి తన కుమారుడు అసిన్ నామ జపమే చేస్తున్నాడని చెపుతోందట. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అసిన్ నోరు మెదపడం లేదు. పైగా ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. మరి ఏం చేయాలనుకుంటుందో..వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











