హత్యకాబడ్డ ప్రత్యూష దెయ్యమయ్యిందా?

By Srikanya

Poga based on Pratyusha murder?
హైదరాబాద్ : కాదేదీ సినిమా కథకు అనర్హం అన్నట్లుగా దర్శక,రచయితలు కుస్తీ పడుతూ కొత్త కాన్సెప్టులు రెడీ చేస్తూంటారు. ఆ మధ్య అనుమాద స్ధితిలో మరణించిన హీరోయిన్ ప్రత్యూష కథ 'పొగ' టైటిల్ తో తెరకెక్కుతోందని సమాచారం. ఆమె దెయ్యంగా మారి పగ తీర్చుకోబోతోందని ఈ కథలో చెప్పబోతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. ఫస్టాఫ్ మొత్తం ప్రత్యూష..ఆమె కెరీర్, మర్డర్ కి దారితీసిన పరిస్ధితులు ఎస్టాబ్లిష్ చేస్తుంది. సెకండాఫ్ లో ఆమె ను చంపిన వారిపై ఎలా పగ తీర్చుకుందనే విషయం ఉంటుందని, అది చాలా భయంకరంగా తీసారని చెప్తున్నారు. అయితే ఈ విషయమే అఫీషియల్ గా ఏ సమాచారం లేదు.

ఓయ్‌' ఫేమ్‌ ఆనంద్‌ రంగా, 'ఎవరైనా ఎపుడైనా' ఫేమ్‌ శం కర్‌ మార్తాండ్‌ సంయుక్తంగా ఓ చిత్రా నికి దర్శకత్వం వహిస్తూ స్వయంగా నిర్మిస్తున్నారు. ఆ చిత్రం పేరు 'పొగ'. నవదీప్‌, మధుశాలిని, రణధీర్‌, అర్చన, సౌమ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'ఫియర్‌ ఈజ్‌ ఇన్‌జ్యూరియస్‌ టు లైఫ్‌' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం గురించి ఆనంద్‌ రంగా, శంకర్‌ మార్తాండ్‌ తెలియజేస్తూ దర్శకులుగా మా ఇద్దరి ప్రయాణం ఒకేసారి మొదలుపెట్టాం. మా ఇద్దరి మదిలో మెదిలిన ఒకే కథను ఇద్దరం కలిసి తెరకెక్కిస్తే బాగుంటుందనే ఆలో చనతో 'పొగ'కు శ్రీకారం చుట్టాం.

అలాగే... మేం అనుకున్నది అనుకున్నట్లుగా తెరపై చూసుకోవాలనే భావనతో దీన్ని సొంతంగా మేమే నిర్మిస్తున్నాం. ఇదొక హారర్‌ సినిమా. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తుంటారు. అలాగే ఈ చిత్రంలోని పాత్రలు అనుకోకుండా కొన్ని తప్పులు చేస్తాయి. అయితే ఆ తప్పు లకు వారు ఎలాంటి మూల్యాన్ని చెల్లించుకున్నారనేది ఈ చిత్రకథ. వెన్నులో వణుకు పుట్టేవిధంగా ఇందులో సన్నివేశాలుంటాయి. 'జో డర్‌గయా వో మర్‌ గయా' అనే హిందీ పాపులర్‌ డైలాగ్‌ ఈ చిత్రానికి కూడా వర్తిస్తుంది' అని చెప్పారు.

ఇక ప్రత్యూష మృతి అనంతరం జరిగిన అనేకసంఘటనలు ఈ కేసులో కొందరు పెద్దల హస్తం ఉన్నట్టు అనుమానాలురేకెత్తించాయి. ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం చేసినడాక్టర్‌ మునిస్వామి ఆమె శరీరభాగాల్లో వీర్యం ఉన్నట్టు నివేదికలోపేర్కొనడమేగాక పత్రికలకు వెల్లడి చేశారు. ఆయనవివరాలను బట్టబయలు చేయడం వివాదాస్పదమైంది. ప్రత్యూషమృతి కేసులో పోలీసు అధికారులు తరచు మాటలు మార్చడం, కేర్‌ఆస్పత్రిలో ఆమె దుస్తులను మాయం చేయడం అనేకఅనుమానాలను దారితీసింది. ప్రత్యూష మృతిపై అసెంబ్లీలో కూడా పెద్దఎత్తున చర్చ జరిగింది. ప్రత్యూష పై కొందరు అత్యాచారం చేశారని, ఆ తర్వాతే ఆమె,ప్రియుడు సిద్ధార్ధరెడ్డి పురుగుమందు తాగారని కొన్నినిజనిర్ధారణ సంఘాలు నిగ్గుతేల్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X