For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమా? : 'శ్రీరామరాజ్యం' నిర్మాతపై పోలీస్ కేసు

  By Srikanya
  |
  Police case on Sriramarajyam producer Yalamanchili Sai Baba
  హైదరాబాద్ : బాలకృష్ణ తో 'శ్రీరామరాజ్యం' చిత్రం నిర్మించిన యలమంచిలి సాయిబాబు,ఆయన కుమారుడు పై 120 (B) మరియు 420 IPC సెక్షన్ లతో హైదరాబాద్ బంజారా హిల్స్ లో పోలీస్ కేసు పెట్టారని మీడియాలో వినిపిస్తోంది. ఆయన తాజా చిత్రం ఇంటింటి అన్నమయ్య తో వచ్చిన ఆర్దిక ఇబ్బందులే దీనికి కారణమని చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఆ చిత్రం ఫైనాన్సియర్స్ పుట్టిస్తున్న ఛీప్ పబ్లిసిటీ స్టంట్స్ గా నిర్మాతకు చెందిన వారు కొట్టిపారేస్తున్నారు. ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది.

  ఇక 'శ్రీరామరాజ్యం' తర్వాత సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న ఈ చిత్రం పై చాలా అంచనాలే ఉన్నాయి. అయితే ఫైనాన్సియల్ సమస్యలతో చిత్రం ఆగిపోయిందని వినికిడి. 'ఇంటింటా అన్నమయ్య' ని సంగీత ప్రధానమైన ప్రేమకథా చిత్రంగా దర్శకుడు తెరకెక్కించారు.

  ఇంటింటా అన్నమయ్య' ద్వారా రేవంత్ హీరోగా పరిచయమవుతున్నాడు. అనన్య, సనంశెట్టి ఇందులో హీరోయిన్లు. ఆ యువకుడికి పాశ్చాత్య సంగీతమంటే మహా ప్రీతి. ర్యాప్‌, పాప్‌... అంటూ గిటారుపట్టుకొని ఆ దిశగానే అడుగులు వేశాడు. అయితే అన్నమయ్య కీర్తనలు విన్నాక మన సంగీతంలోని గొప్పదనాన్నీ, ఆయన రచనలోని వైశిష్ట్యాన్నీ తెలుసుకొన్నాడు. ఆ తరవాత ఏం జరిగిందో తెర మీదే చూడమంటున్నారు రాఘవేంద్రరావు.

  హీరో రేవంత్ చిత్ర విశేషా లను వివరిస్తూ తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని నేటి తరాలకు తెలియజేయడానికి నిర్మించిన చిత్రం 'ఇంటింటా అన్నమయ్య' అని ఈ చిత్రంలో ప్రధానపాత్రలో తాను నటించడం ఆనందంగా వుందని, కీరవాణి అందించిన గీతాలకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని తెలిపారు. అందరి అభిరుచులను దృష్టిలో వుంచుకొని పాటలను సంప్రదాయ గీతాలుగా, చందమామ పాటలుగా, రాక్ సాంగ్స్‌గా రూపొందించారని, సంగీత సాహిత్య విలువలుగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుందని, ప్రతి ఇంటా అన్నమయ్య పాటలు సంకీర్తన చేయాలని ఆయన వివరించారు.

  నిర్మాత మాట్లాడుతూ ''అన్నమయ్య గీతాలకీ ఓ యువకుడి జీవితానికీ ఉన్న బంధమే ఈ కథ. అదేమిటో తెర మీదే చూడాలి. నవతరానికి తెలుగుదనాన్నీ, సంప్రదాయాల్నీ చెప్పేలా ఉంటుంది. రాఘవేంద్రరావు కథను ఆవిష్కరించిన తీరు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. '' అన్నారు.


  అనన్య, సనమ్‌శెట్టి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, అలీ, తనికెళ్ల భరణి, ఏవిఎస్, జయప్రకాష్‌రెడ్డి, రావురమేష్, పోసాని కృష్ణమురళి, జీవా, సుబ్బరాయశర్మ, గుండు సుదర్శన్, తా.రమేష్, అనంత్, భూషణ్, సుధ, హేమ, జ్యోతిరెడ్డి, శ్యామ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: అన్నమయ్య, చంద్రబోస్, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఎడిటింగ్: శ్రవణ్, కథ: శ్రీసాయిబాబా మూవీస్, మాటలు: అనూరాధ ఉమర్జీ, ఆర్ట్: కిరణ్‌కుమార్, నిర్మాత: యలమంచిలి సాయిబాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.

  English summary
  
 
 Case has been filed against Renowned producer Yelamanchali Sai Baba [producer of Sri Rama Rajyam], and his son Yelamanchali Revanth Babu under sections 120 (B) and 420 IPC in Banjara Hills P.S today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X