అజ్ఞాతంలో యాంకర్ ప్రదీప్‌‌, తెర వెనక ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు?

By Bojja Kumar

Recommended Video

అజ్ఞాతంలో యాంకర్ ప్రదీప్‌‌.. తెర వెనక ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు?

యాంకర్ ప్రదీప్ ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు అతడి బిఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. పోలీసులు అతడిని కౌన్సిలింగుకు హాజరు కావాలని ఆదేశించినా ఇప్పటి వరకు అతడు రాలేదు. అతడి కోసం కొందరు పోలీసులు ఇంటికి వెళ్లినా అతడి జాడ దొరకలేదు. దీంతో ప్రదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

మీడియాలో ఇంత రచ్చ అవసరమా? అంటే అవసరమే...

మీడియాలో ఇంత రచ్చ అవసరమా? అంటే అవసరమే...

ప్రదీప్ దొరికిపోయిన దగ్గరి నుండి మీడియాలో, టీవీ ఛానల్స్‌లో దీని గురించి చాలా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఇంత రచ్చ చేయడం అవసరమా? అంటూ కొందరు మీడియా తీరు తప్పుబడుతున్నారు. ఈ లోకంలో ప్రదీప్ ఒక్కడే తాగి దొరికిపోయినట్లు....ఎందుకు ఇంత రాద్దాంతం అంటూ కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఇలాంటి విషయాల్లో రచ్చ జరుగడం మంచిదే, ఎంత రచ్చ జరిగితే సమాజానికి అంత మంచి జరుగుతుంది అనేది నిపుణుల వాదన.

ఇలా రచ్చ జరుగడం వల్ల అయినా జనాల్లో చైతన్యం వస్తుంది

ఇలా రచ్చ జరుగడం వల్ల అయినా జనాల్లో చైతన్యం వస్తుంది

దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం మద్యం సేవించి వాహనాలు నడపటం వల్లనే జరుగుతున్నాయి. కొన్ని సందర్బాల్లో జల్సా రాయుళ్ల డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంది కాబట్టే ప్రదీప్ లాంటి సినీ స్టార్లు, టీవీ స్టార్లు దొరికినపుడు మీడియా ఇంత రచ్చ చేస్తోంది. దీని వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది, కొందరైనా మారే అవకాశం ఉంది.

కేసు నుండి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా?

కేసు నుండి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా?

కేసు నుండి తప్పించుకునేందుకు ప్రదీప్ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే పోలీసు కౌన్సిలింగుకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్నాడనవి వార్తలు వినిపిస్తున్నాయి.

తప్పిస్తానని ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చాడా?

తప్పిస్తానని ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చాడా?

కేసు నుండి తప్పిస్తానని ప్రదీప్ కు ఓ ప్రముఖ వ్యక్తి హామీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నువ్వు కొన్ని రోజులు ఎవరికీ కనిపించకుండా ఉండు, రెండ్రోజులైతే మీడియా ఈ విషయాన్ని మరిచిపోతుంది. తర్వాత అంతా నేను సెట్ చేస్తాను అని సదరు వ్యక్తి ప్రదీప్ కు హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సీజ్ చేసిన కారు విడిపించే ప్రయత్నం

సీజ్ చేసిన కారు విడిపించే ప్రయత్నం

ప్రదీప్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లకుండానే సీజ్ చేసిన కారును విడిపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. మరి ప్రదీప్ వెనక ఉన్న ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు? అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

అతిగా మద్యం సేవించిన ప్రదీప్

అతిగా మద్యం సేవించిన ప్రదీప్

డిసెంబర్ 31వ తేదీ రాత్రి బ్రీత్ ఎనలైజర్‌తో పోలీసులు ప్రదీప్‌ను పరీక్షించగా.... 178 పాయింట్లు చూపించింది. దీన్ని బట్టి సాధారణ స్థాయి కంటే ప్రదీప్ నాలుగైదు రెట్లు ఎక్కువ మద్యం సేవించాడని తేలిపోయింది.

జైలు శిక్షపై చర్చ

జైలు శిక్షపై చర్చ

ప్రదీప్ సేవించిన మద్యం మోతాదుకు గాను ఆయనకు దాదాపు వారం రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీని గురించి ఆసక్తికర చర్చ సాగుతుంది.

చార్జ్ షీట్ దాఖలైంది

చార్జ్ షీట్ దాఖలైంది

సాంకేతికంగా ప్రదీప్‌కు శనివారం వరకూ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. అయితే పోలీసులు కౌన్సిలింగుకు హాజరు కావాలని చెప్పినపుడు హాజరవ్వాలి. కానీ ప్రదీప్ అలా చేయలేదు. అతడు కౌన్సిలింగుకు హాజరు కాని విషయాన్ని కూడా పోలీసులు చార్జి షీట్లో పేర్కొన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X