ఊసరవెల్లి ఆడియో ఫంక్షన్ కి డుమ్మా..అభిమానులను నిరాశపరిచిన బాలయ్య...!
టాలీవుడ్‌లో ఇపుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. బాలకృష్ణ - జూ ఎన్టీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ ఫిలిమ్‌నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణగా వారు ఊసరవెల్లి ఆడియో ప్రోగ్రామును చూపుతున్నారు. ఊసరవెల్లి ఆడియో ఫంక్షనుకూ బాలయ్య - జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య కోల్డ్ వార్ కి లింకేమిటి.. అనుకుంటున్నారా..? ఉందంటున్నారు. అదెలాగంటే.. సహజంగా జూ ఎన్టీఆర్ చిత్రమంటే నందమూరి హీరోలంతా వస్తారు. కానీ ఊసరవెల్లి ఆడియో కార్యక్రమానికి ఒక్కరు కూడా హాజరు కాలేదు. చివరి దాకా నందమూరి హీరోల కోసం ఎదురు చూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఎందుకిలా జరుగుతోంది.. అని ఆరా తీస్తే… ఇటీవల కాలంలో బాలయ్య బాబును తురుపుముక్కలా ఉపయోగించి హరికృష్ణకు - ఆయన కుమారుడు జూ ఎన్టీఆర్ కు చెక్ పెట్టాలని చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ వేశారంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల బాలయ్యతో ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటన ఇప్పించారంటున్నారు. మొత్తమ్మీద నారా, నందమూరి ఫ్యామిలీల మధ్య పొలిటికల్ గేమ్ తారాస్థాయికి చేరిపోయిందంటున్నారు.
ఇదంతా ఇలావుంటే జూ ఎన్టీఆర్ ప్రస్తుతానికి పొలిటిక్స్ జోలికి వెళ్లకుండా తన కెరీర్ బిల్డప్ పైనే దృష్టి సారించారనీ, అందువల్లనే ఎవర్నీ పిలువకుండా తనదైన స్టయిల్ లో ముందుకు వెళుతున్నాడనీ అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తమన్నా, జూ ఎన్టీఆర్ మద్య క్లైమాక్స్ సీన్స్ కొన్ని ను చిత్రీకరిస్తున్నారు. ఊసరవెల్లి" షూటింగ్ దాదాపు పూర్తి అయ్యీ, అక్టోబర్ 6 న విడుదల అయ్యేందుకు త్వర త్వరగా సన్నాహాలు సిద్దం చేసుకోంటోంది.


Click it and Unblock the Notifications











