Guntur Kaaram: మహేశ్ మూవీలో రాజకీయ కోణం.. పవన్, చంద్రబాబుకు త్రివిక్రమ్ సపోర్ట్?
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలంగా స్టార్‌డమ్‌ను కొనసాగిస్తూ.. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు మజాను పంచుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య వరుసగా హిట్లు కొట్టిన అతడు.. గత చిత్రంతో మాత్రం నిరాశనే ఎదుర్కొన్నాడు. దీంతో ఈ సారి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో 'గుంటూరు కారం' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రంలోని ఓ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏంటా మేటర్? పూర్తి వివరాలు మీకోసమే!
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన పక్కా కమర్షియల్ మూవీనే 'గుంటూరు కారం'. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఈరోజే (జనవరి 12న) గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఇది 3000లకు పైగా థియేటర్లలోనే విడుదల అయింది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'గుంటూరు కారం' మూవీకి ప్రీమియర్స్ నుంచే డీసెంట్ టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే కనిపించింది. దీనికి అనుగుణంగానే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కింది. ఫలితంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ. 52.03 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసి సత్తా చాటింది.
మహేశ్ బాబు నటించిన 'గుంటూరు కారం' మూవీకి సంబంధించిన ఓ అంశం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అదేమిటంటే.. ఈ చిత్రం ప్రకాశ్ రాజ్ పార్టీ పేరును త్రివిక్రమ్ JDP (జనదళం పార్టీ) అని చూపించాడు. దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సపోర్టుగానే ఇలా పెట్టాడని చర్చ మొదలైంది.

'గుంటూరు కారం' మూవీలోని పార్టీ పేరును జనసేనలో J, తెలుగుదేశం పార్టీలోని DPని కలిపి JDP (జనదళం పార్టీ) అని త్రివిక్రమ్ పెట్టాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ రకంగా తన స్నేహితుడైన పవన్ కల్యాణ్‌కు గురూజీ సపోర్టు చేస్తున్నాడని సోషల్ మీడియాలో కొందరు చెప్పుకుంటున్నారు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
ఇదిలా ఉండగా.. మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించారు. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు. ఇక, ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











