పవన్ కళ్యాణ్ వర్సెస్ జూ ఎన్టీఆర్...పోటీపై ఆసక్తి!
హైదరాబాద్: సంక్రాంతి పండగకు స్టార్ హీరోలు పోటీకి రావడం, బాక్సాఫీసు రేసులో రసవత్తరంగా తల పడటం ప్రతి సంవత్సరం కామనే. ఈ సారి కూడా అలాంటి పోటీనే చూడబోతున్నాం. ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బాక్సాఫీసు రేసులో పోటీ పడబోతున్నారు. పవన్ కళ్యాణ్ 'గోపాలా గోపాలా' చిత్రంతో పాటు.....పూరి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'గోపాలా గోపాలా' చిత్రం వాస్తవానికి దసరా లేదా దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఫ్యామిలీ సబ్జెక్టుతో కూడిన సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా కావడంతో సంక్రాంతికి విడుదల చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వక్కంతం వంశీ అందించిన కథతో వస్తున్న సినిమా సంక్రాంతి నాటికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గతంలో 'కుమ్మెస్తా' , 'రుబాబు' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా 'నేనో రకం', 'టెంపర్' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. మరి ఈ టైటిల్ అయినా ఫైనల్ అవుతుందో? లేదో? త్వరలో తేలనుంది.


Click it and Unblock the Notifications











