ఎన్టీఆర్ 'శక్తి ' లో సెక్సీ ఆంటీ సీన్స్ హైలెట్
అప్పుడెప్పుడో మోహన్ బాబు సరసన 'చిట్టెమ్మ మొగుడు' చిత్రంలో హీరోయిన్ గా చేసిన పూజాబేడీ గుర్తుందా?. ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి' చిత్రంలో ఆమె ఓ ఈజెప్టు వనితగా దర్శనమివ్వనుంది. ఈ విషయమై పూజా బేడి మాట్లాడుతూ...నా పాత్ర ఈ చిత్రంలో చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. నేను ఈ చిత్రంలో మ్యాజిక్ పవర్స్ కలిగిన ఈజిప్టు వనితగా కనిపిస్తాను. ఈ పాత్రకోసం రిలాక్స్ అయి నాకు నేనుఛార్జింగ్ చేసుకుని, షేఫ్ సరిచేసుకున్నాను. ఇక ఈ క్యారెక్టర్ గురించి చెప్పగానే మరో మాట లేకుండా ఒప్పేసుకున్నాను. ఓ పెద్ద బ్యానర్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోగా చేస్తున్న చిత్రం ఎలా వదిలేది అంటోంది. కరెక్టే రెమ్యునేషన్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి కాదని ఉండదు.
ఇక శక్తి చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వం చేస్తూంటే అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇలియానా హీరోయిన్ గా చేస్తోన్న ఈ చిత్రం సోషియో ఫాంటసీగా రూపొందుతోందని సమాచారం. అలాగే పూజాబేడీ మీద ప్లాన్ చేసిన సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిస్తానయి చెప్పుకుంటున్నారు. అలాగే తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటున్న కాస్ట్ లీయెస్ట్ సినిమా ఇది. ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి వీరేంద్రనాథ్, జె.కె.భారవి, తోట ప్రసాద్, డి.ఎస్.కన్నన్, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, సమర్పణ: ధర్మరాజు, నిర్మాత: సి.అశ్వనీదత్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్.


Click it and Unblock the Notifications











