ఫోర్న్ హీరోయిన్ ఐతే మాత్రం రోత మాటలు భరిస్తుందా?
ఇండో-కెనడియన్ ఫోర్న్ స్టార్ సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్లో రూపొందుతున్న జిస్మ్-2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తన అందాలతో బాలీవుడ్‌ను షేక్ చేసిన హాట్ లేడీ పూజా భట్ 'జిస్మ్-2' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
వాస్తవానికి 'జిస్మ్-2' చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్న తర్వతే ఇండియా వదిలి వెళ్లాలనుకుందట సన్నీలియోన్. అయితే దర్శకురాలు పూజా భట్ అహంకార ప్రవర్తన మూలంగా తాను అనుకున్న సమయం కంటే ముందే ఇండియా వదిలి వెళ్లింది. జిస్మ్ 2 చిత్రం చివరి షూటింగ్ షెడ్యూల్‌లో పూజా భట్ చిన్న చిన్న విషయాలకే మండి పడుతూ వినడానికి రోత పుట్టించే బూతు పదాలు వాడుతూ సన్నీని దూషించిందట. తన కెరీర్లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ ఎదుర్కొని సన్నీబాగా అప్ సెట్ అయి అనుకున్నదానికంటే ముందుగానే తిరిగి తన దేశానికి వెళ్లిందని బాలీవుడ్ టాక్. ఫోర్న్ స్టార్ అయినంత మాత్రాన సన్నీ ఆ మాటలు పడాలా? ఆమె చేసింది కరెక్టే అంటున్నారు అభిమానులు.
పూజాభట్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే మహేష్ భట్ అందించారు. డినో మోరియా, పూజా భట్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సన్నీలియోన్‌తో పాటు రణదీప్ హూడా, అరుణోదయ్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications












