ఎన్నికల్లో పోటీకి నటి పూజా గాంధీ రెడీ?
ఆమెకు బిఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ టికెట్ లభించినట్లు చెబుతున్నారు. జెడిఎస్ పార్టీకి ఆమె గుడ్‌బై చెప్పి బిఎస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పూజా గాంధీ నిరుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమె ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం కూడా సాగిస్తున్నారు. అయితే ఆమె పోటీ చేసే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఆమెకు సంజనా గాంధీ అనే పేరు కూడా ఉంది. ముంగరు మాలే, తాజ్ మహల్, బుధివంట వంటి హిట్ సినిమాల్లో ఆమె నటించారు. నిరుడు జనవరి 18వ తేదీన పూజా గాంధీ జనతాదళ్(ఎస్)లో చేరారు. ఆమెను పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఆ తర్వాత పక్కకు తప్పిస్తూ వచ్చారు.
జెడిఎస్ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌జి దేవెగౌడ కూడా పూజా గాంధీ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఆమె సౌకర్యంగా లేరని, ఆమె వేరే పార్టీలో చేరవచ్చునని అప్పట్లో అన్నారు. దీంతో ఆమె పార్టీకి వీడ్కోలు చెప్పారు.


Click it and Unblock the Notifications












